https://oktelugu.com/

Nagarjuna-EVV: నాగార్జున కు ఈవీవీకి మధ్య గొడవేంటో తెలుసా..?

నాగార్జున నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని, తనకు తానుగా ఇండస్ట్రీలో ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే నాగార్జున ఈవీవీ సత్యనారాయణ తో హలో బ్రదర్ అనే సినిమా చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 13, 2024 12:06 pm
    Do you know the quarrel between Nagarjuna and EVV
    Follow us on

    Nagarjuna-EVV: యువ సామ్రాట్ నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా, అలాగే మన్మధుడిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఇండస్ట్రీలో కంటెంట్ల పరంగా కొన్ని ఎక్స్పరిమెంట్లను చేసిన హీరో కూడా నాగార్జునే కావడం విశేషం. ఎందుకంటే పాతిక సంవత్సరాల వయసులోనే ఆయన అన్నమయ్య లాంటి ఒక భక్తి భావం తో కూడిన సినిమాలో నటించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు.

    అలాంటి నాగార్జున నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని, తనకు తానుగా ఇండస్ట్రీలో ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే నాగార్జున ఈవీవీ సత్యనారాయణ తో హలో బ్రదర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా టైం లో నాగార్జునకి, ఇవివి గారికి చిన్నపాటి క్లాషేష్ కూడా వచ్చాయనే వార్తలు అప్పట్లో మీడియాలో కథలు కథలుగా వచ్చాయి. అది ఏంటి అంటే ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో నాగార్జున అంత సంతృప్తిగా లేడట, దాంతో ఇవివి ఈ సినిమా క్లైమాక్స్ కోసం డిఫరెంట్ వర్షన్స్ ను రాసుకున్నాడట.

    అయినప్పటికీ అవి ఏవి కూడా నాగార్జునకి పెద్దగా నచ్చడం లేదంట, దాంతో నాగార్జున నే ఒక క్లైమాక్స్ చెప్పి అది ఎలా ఉంది అని ఈవీవీ గారిని అడిగితే, ఇవివి అంత బాలేదని చెప్పడంతో నాగార్జున హర్ట్ అయినట్టుగా కూడా అప్పట్లో చాలా వార్తలు అయితే వచ్చాయి. ఇక మొత్తానికైతే ఇద్దరూ కలిసి ఒక మంచి క్లైమాక్స్ ని క్రియేట్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. దాంతో ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి మళ్లీ కలిసిపోయారు. అలా ఇండస్ట్రీలో హీరో డైరెక్టర్ల మధ్య తరచూ కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి.

    ఎందుకంటే ఒక స్టోరీని జడ్జ్ చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని సినిమాల విషయంలో ఇలాంటి క్లాషేష్ రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ సినిమా తర్వాత మళ్లీ అందరూ కలిసి పోయి సంతోషంగా ఉండటం మనం చాలా సార్లు చూశాం…