https://oktelugu.com/

Food In News Papers: న్యూస్ పేపర్లో చుట్టిన మిర్చి, బజ్జీలు తింటున్నారా? FSSAI హెచ్చరిక.. ఎందుకో తెలుసుకోండి..

ఆహారపదార్థాలకు ఈ కెమిక్స్ అంటుకోవడం వల్ల అనేక అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. కొందరు ఇంట్లో ఫుడ్ ను ఇష్టపడని వారు రోజు బయటి పదార్థాలు తింటూ ఉంటారు.

Written By: , Updated On : September 29, 2023 / 12:35 PM IST
Food In News Papers

Food In News Papers

Follow us on

Food In News Papers: సాయంత్రం స్నాక్స్ లో భాగంగా… చాలా మంది రోడ్ సైడ్ లభించే మిర్చి, బజ్జీలనే టేస్ట్ చేసేందుకు ఇష్టపడుతారు. వీటిని తయారు చేయడానికి కొందరు నాసిరకం ఆయిల్ వాడడంతో పాటు ఆరోగ్య నియమాలు ఏమాత్రం పాటించకపోయినా.. రుచి గా ఉండడంతో ఎగబడి మరీ కొనుక్కొని తింటుంటారు. మిర్చి, బజ్జీలు తయారు చేసేవారు వాటిని డీప్ ఫ్రై చేసి ఆ తరువాత అవి వేడిగా ఉండగానే న్యూస్ పేపర్లో చుట్టి ఇస్తారు. న్యూస్ పేపర్ పెద్ద కాస్టేమీ కాకపోవడంతో చాలా మంది న్యూస్ పేపర్లను ఇలా ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా వేడి చేసిన ఆహర పదార్థాలను న్యూస్ పేపర్లు చుట్టడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయని FSSAI హెచ్చరిస్తోంది. అవేంటంటే?

Food Safety Standard Authourity Of India (FSSAI ) ప్రకారం న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారాన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. న్యూస్ పేపర్ తయారు చేసేటప్పుడు ఇందులో తెల్లటి పేపర్ పై బ్లాక్ లేదా కలర్ అక్షరాలు, ఫొటోలు రావడానికి కొన్ని రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఇవి న్యూస్ పేపర్ పై అద్దిన రంగు త్వరగా డ్రై కావడానికి ఉపయోగపడుతుంది. అయితే న్యూస్ పేపర్ ను చదివిన తరువాత వాటిని కిరాణ షాపులు, మిర్చి బజ్జీ సెంటర్ల తిరి వాడుతూ ఉంటారు. ఈ క్రమంలో వేడి చేసిన పదార్థాలు వాటిలో పెట్టడం వల్ల కెమికల్స్ ఆహార పదార్థాలకు అంటుకునే ప్రమాదం ఉందని FSSAI తెలిపింది.

ఆహారపదార్థాలకు ఈ కెమిక్స్ అంటుకోవడం వల్ల అనేక అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. కొందరు ఇంట్లో ఫుడ్ ను ఇష్టపడని వారు రోజు బయటి పదార్థాలు తింటూ ఉంటారు. ఇలా న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారం తినడం వల్ల న్యూస్ పేపర్ పై ఉన్న ఇంక్ కరిగి శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది కంటిచూపుపై ప్రభావం పడుతుంది. అలాగే న్యూస్ పేపర్ పై ఉన్న ఇంక్ ను డ్రై చేయడానికి కొన్ని కెమికల్స్ వాడుతారు. ఇది శరీరంలోకి వెళ్లడం ద్వారా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే FSSAI న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారాన్ని తినొద్దని ప్రచార చేస్తోంది. అయితే అమ్మకం దారుల్లో, వినియోగదారుల్లో ఇంకా అవగాహన రాకపోవడం వల్ల చాలా మంది న్యూస్ పేపర్లను వేడి చేసిన పదార్థాలకు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఇంట్లో తయారు చేసుకున్న ఆహార పదార్థాల్లోని నూనెను తొలగించడానికి న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటారు. ఇలా ఉపయోగించడం కూడా మంచిదికాదని FSSAI హెచ్చిరిస్తోంది.