Chandramukhi 2 Collections: ఒక్క రోజులో చంద్రముఖి 2 కి వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

దాదాపు 17 సంవత్సరాల తర్వాత భారీ అంచనాలతో వచ్చిన చంద్రముఖి 2 సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.అయితే ఈ సినిమా తీయడానికి మొత్తం 65 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు గా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : September 29, 2023 12:22 pm

Chandramukhi 2 Collections

Follow us on

Chandramukhi 2 Collections: 2005 లో రజినీకాంత్ హీరో గా పి వాసు డైరెక్షన్ లో వచ్చిన చంద్రముఖి సినిమా కి సిక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 సినిమా భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది.ఈ సినిమాలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ఇద్దరు జంట గా నటించి మొదటి నుంచి ఈ సినిమాకి చాలా హైప్ తీసుకువచ్చారు. ఈ చంద్రముఖి 2 మూవీ ప్రపంచ వ్యాప్తం గా నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది.అయితే ఈ సినిమా కి బడ్జెట్ ఎంత అయింది ఒక్క రోజులో ఎంత కలెక్ట్ చేసింది అలాగే లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతుంది లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

దాదాపు 17 సంవత్సరాల తర్వాత భారీ అంచనాలతో వచ్చిన చంద్రముఖి 2 సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.అయితే ఈ సినిమా తీయడానికి మొత్తం 65 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ ని భారీ గానే చేసింది.ఇక ఈ సినిమా తమిళం లో 35 కోట్ల వరకు బిజినెస్ చేయగా, తెలుగు లో డబ్ చేసినందుకు గాను తెలుగు నుంచి ఒక 10 కోట్ల వరకు బిజినెస్ చేసింది.దాంతో ఈ సినిమా రిలీజ్ కి ముందే 45 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది.అయితే ఈ సినిమా కి లాభాలు రావాలంటే 45 కోట్ల వరకు కలక్షన్స్ అనేవి రాబట్టాలి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మాత్రం 65 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి అందుకోసమే ఈ సినిమా ని భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు.ఇక ఈ సినిమా కి మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 కోట్ల వరకు కలక్షన్స్ ని ఈ సినిమా రాబట్టినట్టుగా తెలుస్తుంది.

తమిళం లో ఈ సినిమా ఒక్క రోజులో 5.5 కోట్ల వరకు కలెక్ట్ చేయగా, తెలుగు లో మాత్రం ఒక కోటి రూపాయల వరకు కలెక్ట్ చేసినట్టు గా తెలుస్తుంది.ఇక ఓవర్సీస్ లో 50 లక్షల వరకు కలక్షన్స్ ని రాబట్టింది.తెలుగు లో కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి కానీ గత రెండు రోజులు గా తెలుగు లో వినాయక నిమజ్జనం జరుగుతుండగా అందుకే ఈ సినిమాకి కొంత వరకు కలక్షన్ తగ్గాయనే చెప్పాలి.ఇక దీనికి తోడు రామ్ హీరో గా వచ్చిన స్కంద సినిమా కూడా నిన్న నే రిలీజ్ అవడం తో ఈ సినిమాకి రావాల్సిన కొంత కలెక్షన్స్ ని ఆ సినిమా కూడా షేర్ చేసుకుందనే తెలుస్తుంది.

ఇక ఈ సినిమా లాభాల బాట పట్టాలి అంటే 45 కోట్ల కి పైన వసూళ్ళని రాట్టాల్సి ఉంటుంది.ఇక బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 65 కోట్ల పైన రాబట్టాల్సి ఉంది.ఇక ఈ సినిమాకి ఈ వీకెండ్ చాలా కీలకంగా మారనుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా భవిష్యత్తు ఏంటి అనేది ప్రేక్షకులు తేల్చేస్తారు.ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మంచి వసూళ్ళని రాబడితే ఈ మూవీ సేఫ్ జోన్ లో ఉంటుంది లేకపోతే మాత్రం ఈ మూవీ కి నష్టాలు తప్పవు అంటూ చాలా మంది ట్రేడ్ పండితులు సైతం చెప్పడం జరుగుతుంది…