
Heatstroke: వేసవి కాలంలో వడదెబ్బ సహజం. మన శరీరం డీ హైడ్రేషన్ కు గురైతే శరీరంలో నీరు లేకుండాపోతుంది. దీంతో వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బతో ప్రాణాలే పోతాయి. అంతటి ప్రమాకరమైంది. దీంతో ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. లేకపోతే మన ప్రాణాలు గాల్లో కలవడం కామన్. ఈ నేపథ్యంలో వడదెబ్బ సోకకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా.
ఈ కాలంలో మనకు విరివిగా దొరికేవి దోసకాయలు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. శరీరంలో తేమను నిలిపి ఉంచుతాయి. బరువు పెరగకుండా చేస్తాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీంతో వడదెబ్బ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
సిట్రస్ పండ్లు
పులుపు ఉన్న పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో నిమ్మ, నారింజ వంటివి ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఒంట్లో నీటి శాతం పెరుగుతుంది. దీంతో వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఘన పదార్థాలకంటే ద్రవ పదార్థాలే ఎక్కువ మేలు కలిగిస్తాయి. ఈ క్రమంలో వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి మనం ఈ రకమైన పండ్లు తీసుకునేందుకు చొరవ తీసుకోవాలి.

వేసవి కాలంలో నిమ్మరసం ఎక్కువగా తాగాలి. దీని వల్ల శరీరంలో బయటకు పోయిన ఉప్పు దీని ద్వారా వస్తుంది. నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే వడదెబ్బ ప్రమాదం ఉండదు. నిమ్మరసం ఏ కాలంలో అయినా తాగొచ్చు. కానీ ఎండాకాలంలో అయితే ఎక్కువగా తాగితే మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు.
ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు బయట తిరగకూడదు. ఎండలో తిరిగితే మన శరీరం అలసటకు గురవుతుంది. చెమటలు ఎక్కువగా పట్టి శరీరంలోని నీరంతా ఆవిరిగా మారుతుంది. దీని వల్ల వడదెబ్బ సోకే అవకాశం ఉంది. దీంతో నీడ పట్టునే ఉండి పనులు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎండలో తిరగడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి.