Flight Travel: విమాన ప్రయాణం కూడా ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వస్తోంది. పెరుగుతున్న తలసరి ఆదాయం.. అత్యవసరం.. వేగంగా గమ్యానికి చేరుకోవాలని మిడిల్‌క్లాస్ జనం కూడా ఫ్లైట్ ఎక్కుతున్నారు. దీంతో విమానాలకు గిరాకీ పెరుగుతోంది. ఫ్లైట్ టికెట్ ముందే రిజర్వే చేసుకుంటారు. అయితే అనుకోని కారణాలతో ప్రయాణం వాయిదా పడినా, ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయినా టికెట్ చార్జీలు రావు. కానీ, కొంతమొత్తం రిఫండ్ చేసుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు.
ఇవి రిటర్న్…
మన ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయినప్పుడు, అనుకోని కారణాలతో ప్రయాణం వాయిదా వేసుకున్నప్పుడు కొంత డబ్బులు ఎయిర్‌లైన్స్ వారు రిఫండ్ ఇస్తారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎలా రిఫండ్ చేసుకోవాలి, ఎంత మొత్తం వస్తుంది తెలుసుకుందాం.
ఫ్లైట్ ఇకెట్‌లో ఇవీ..
ఫ్లైట్ టికెట్‌లో ప్రయాణ చార్జీతోపాటు ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ ఫీజు, ఫ్యూచర్ డెవలప్‌మెంట్ ఫీజు, ప్యాసింజర్ సర్వీస్ ఫీజుతోపాటు కొన్ని టాక్స్‌లు కూడా ఉంటాయి. ప్రాయాణం చేయనప్పుడు వీటిని మనం రిఫండ్ చేసుకోవచ్చు.
కౌంటర్‌లో అప్లయ్ చేయాలి..
ప్రయాణం వాయిదా పడినా, మిస్ అయినా నోషో రిఫండ్ ద్వారా కొన్ని చార్జీలను మనం పొందాలి. దీనికోసం ఎయిర్‌లైన్ కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు ఫ్లైట్ కికెట్ రూ.5 వేలు అయితే.. వివిధ చార్జీల రూపొంలో ఉండే వాటిని విమానయాన సంస్థ మనకు రిటర్న్ ఇస్తుంది. ఇందులో రూ.300 నుంచి రూ.600 వరకు రిటర్న్ ఫొందే అవకాశం ఉంటుంది.