Homeట్రెండింగ్ న్యూస్Techie Life: ఐదు అంకెల జీతం.. అయినా సంతృప్తి లేని జీవితం.. యువ టెకీ పోస్ట్...

Techie Life: ఐదు అంకెల జీతం.. అయినా సంతృప్తి లేని జీవితం.. యువ టెకీ పోస్ట్ వైరల్!!

Techie Life
Techie Life

Techie Lite: అతనో యువ సాప్ట్ వేర్.. ఏడాదికి అక్షరాలా అర కోటి జీతం.. అనుకూలమైన పని వేళలు.. అయినా జీవితంలో సంతృప్తి లేదట. ‘నా జీవితంలో ఏదో అసంతృప్తి’ అంటూ ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందరినీ ఆలోచింప చేస్తుంది.

ఏదో కోల్పోతున్నా…
చదువు ముగియగానే పెద్ద కంపెనీలో ఉద్యోగం.. మంచి ప్యాకేజీ.. అనుకూలమైన పని వేళలు.. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ‘నువ్వు జీవితంలో సెటిల్‌ అయిపోయావ్‌..’ అనే మాటలతో ఓ వైపు సంతోషం ఉన్నా.. ఎక్కడో చిన్న అసంతృప్తి. జీవితంలో ఇంకా ఏదో కోల్పోతున్నాననే భావన నిత్యం వెంటాడుతూనే ఉంది. ఇదంతా ఒక యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అంతరంగం. తన మససులోని ఆవేదనకు అక్షర రూపమిస్తూ.. ‘జీవితంలో సంతృప్తి లేదు’ అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ పోస్ట్‌ను సుఖదా అనే ట్విటర్‌ యూజర్‌ ‘ది అదర్‌ ఇండియా’ పేరుతో షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. తన పేరు, పూర్తి వివరాలు చెప్పని ఆ యువ టెకీ అంతరంగం అతని మాటల్లో…

సలహా ఇవ్వండి అంటూ..
‘‘నా వయస్సు 24 ఏళ్లు. నేను ప్రముఖ ఐటీ సంస్థలో మూడేళ్లుగా పనిచేస్తున్నాను. నా జీతం ఏడాదికి రూ.58 లక్షలు. అనుకూలమైన పనివేళలు. కానీ, నాకు సంతృప్తి లేదు. ఏదో తెలియని వెలితి. జీవితంలో నేను ఒంటరిగానే ఉంటున్నానే భావన. నాకు గర్ల్‌ఫ్రెండ్‌ లేదు. నా స్నేహితులందరూ వారి జీవితాలతో బిజీగా ఉన్నారు. నా ఉద్యోగ జీవితంలో కూడా ఎలాంటి మార్పూ లేదు. నా కెరీర్ ప్రారంభం నుంచి ఒకే కంపెనీలో పనిచేయడం వల్ల కావచ్చు లేదా ఒకే పని రోజూ చేస్తుండటం వల్లనో గానీ నా ఉద్యోగంలో ఎలాంటి కొత్తదనం లేదు. దాంతో పనిలో కొత్త సవాళ్లు, కెరీర్‌లో మరింత ఎదగడంపై దృష్టి పెట్టలేదు. నా జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మలచుకోవడానికి ఏం చేయాలో దయచేసి నాకు సలహాలు ఇవ్వండి. ‘జిమ్‌కి వెళ్లు’ అని మాత్రం చెప్పకండి, ఎందుకంటే నేను ఇప్పటికే వెళ్తున్నాను..” అని రాసుకొచ్చాడు.

డిఫరెంట్ కామెంట్స్..
ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘జీవితంలో డబ్బు ఉంటే సరిపోదు.. సంతోషం కూడా ఎంతో ముఖ్యం అనేందుకు ఇదే ఉదాహరణ’, ‘24 ఏళ్లకే చేతి నిండా డబ్బు.. లగ్జరీ లైఫ్‌స్టైల్‌.. ఒంటరితనం అనేవి చాలా మంది ఎదుర్కొనే సమస్య’, ‘గర్ల్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవడం లేదా పెళ్లి చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం’, ‘స్టార్టప్‌ను ప్రారంభించండి’ అంటూ నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.

Techie Life
Techie Life

మొత్తానికి డబ్బుతో సంతోష్ లేదన్న విషయం ఈ యువ సాఫ్టు వేర్ ఇంజినీర్ త్వరగానే అర్థం చేసుకున్నాడు.. నిజమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుందో.. అలా దొరికిందని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడో చూడాలి!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version