Akkineni Nagarjuna: సోలో సినిమాలు వద్దు..ముల్టీస్టార్ర్ర్ సినిమాలు ముద్దు అంటున్న అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna: గత కొంతకాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేస్తున్న హీరో అక్కినేని నాగార్జున. ప్రయాగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన నాగార్జునకి ఒకప్పుడు ఆ ప్రయోగాలే ఆయనని స్టార్ హీరో గా నిలబెట్టాయి. కానీ ఇప్పుడు ఆ ప్రయోగాలే స్టార్ స్టేటస్ ని పొయ్యేలా చేసింది. మూడు దశాబ్దాల నుండి టాప్ 4 హీరోస్ లో ఒకరిగా కొనసాగిన నాగార్జున కి జీరో షేర్ వచ్చిన […]

Written By: Vicky, Updated On : April 22, 2023 3:47 pm
Follow us on

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: గత కొంతకాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేస్తున్న హీరో అక్కినేని నాగార్జున. ప్రయాగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన నాగార్జునకి ఒకప్పుడు ఆ ప్రయోగాలే ఆయనని స్టార్ హీరో గా నిలబెట్టాయి. కానీ ఇప్పుడు ఆ ప్రయోగాలే స్టార్ స్టేటస్ ని పొయ్యేలా చేసింది. మూడు దశాబ్దాల నుండి టాప్ 4 హీరోస్ లో ఒకరిగా కొనసాగిన నాగార్జున కి జీరో షేర్ వచ్చిన సినిమాలు కూడా ఈమధ్యనే తగిలాయి.

ఇది ఆయన ఇమేజిని మసకబారేలా చేసింది.రీసెంట్ గా విడుదలైన ‘ఘోస్ట్’ చిత్రం కూడా 10 కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లను రాబట్టింది. ఇది నాగార్జున సినీ ప్రస్థానం కి అవమానం లాంటిది.అభిమానులు దయచేసి ఇక ప్రయోగాలు ఆపు అంటూ నాగార్జున ని వేడుకుంటున్నారు.అభిమానుల ప్రార్థనలను మన్నించి ఇక నుండి నాగార్జున ప్రయాగాత్మక చిత్రాల దరిదాపుల్లోకి కూడా వెళ్ళడానికి ఇష్టపడడం లేదట.

అంతే కాకుండా ఆయన ఇక నుండి సోలో హీరో గా కంటే కూడా మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు.ప్రస్తుతం ఆయన ‘ధమాకా’ రచయిత ప్రసన్న కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ కమర్షియల్ మాస్ సినిమాలో, నాగార్జున తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటించబోతున్నాడు. అల్లరి నరేష్ కి ఈ చిత్రం లో నాగార్జున తో సరిసమానమైన పాత్రని డిజైన్ చేసాడట డైరెక్టర్.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.

Akkineni Nagarjuna

ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తమిళ స్టార్ హీరో సూర్య తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడట నాగార్జున.ఒక కొత్త డైరెక్టర్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నాడు.ఇలా వరుసగా ఆయన మల్టీస్టార్ర్ర్ సబ్జక్ట్స్ చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట, ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున కి ఇది సరికొత్త ఇన్నింగ్స్.ఈ సరికోతే ఫేస్ లో అభిమానులను ఆయన ఎలా అలరించబోతున్నాడో చూడాలి.