
Vinodhaya Sitham: పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబోలో వినోదయ సితం రీమేక్ ప్రకటించి చాలా కాలం అవుతుంది. దాదాపు ఏడాది కాలంగా దీనిపై చర్చ నడుస్తోంది. ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరిగాయంటూ ప్రచారం జరిగింది. అలాగే జనవరి నెలలో షూటింగ్ మొదలవుతుందంటూ కథనాలు వెలువడ్డాయి. ఇవ్వన్నీ ఊహాగానాలే కానీ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. దీంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఎట్టకేలకు యూనిట్ స్పష్టత ఇచ్చారు. నిర్మాతలు వినోదయ సితం షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘ఇవాళ నుండి పవన్ కళ్యాణ్ -సాయి ధరమ్ తేజ్ మూవీ పట్టాలెక్కుతుంది. త్వరలో అదిరిపోయే అప్డేట్’ ఇవ్వనున్నాం… అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. అలాగే సాయి ధరమ్, పవన్, చిత్ర యూనిట్ ఫోటోలు షేర్ చేశారు. ఫైనల్ గా వినోదయ సితం రీమేక్ రెగ్యులర్ షూట్ మొదలైంది. సముద్ర ఖని ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కాగా వినోదయ సితం స్క్రిప్ట్ త్రివిక్రమ్ సిద్ధం చేశారు. జస్ట్ స్టోరీ లైన్ తీసుకొని పవన్ ఇమేజ్ కి తగ్గట్లు సమూల మార్పులు చేసినట్లు సమాచారం. భీమ్లా నాయక్ స్క్రిప్ట్ కూడా త్రివిక్రమ్ డెవలప్ చేసిన విషయం తెలిసిందే. తమిళ చిత్రమైన వినోదయ సితం ని పవన్-సాయి ధరమ్ లకు సెట్ అయ్యేలా సన్నివేశాలు, కథనంలో మార్పులు చేశారట. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. కేవలం 20 నుండి 25 రోజులు మాత్రమే వినోదయ సితం రీమేక్ కి పవన్ కేటాయించారట.

ఇక మొదటిసారి సాయి ధరమ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నారు. అందుకే ఈ కాంబినేషన్ మరింత ప్రత్యేకం. ఇద్దరు మెగా హీరోలు కలిసి చేస్తున్న మల్టీస్టారర్. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే సూచనలు కలవు. అలాగే పవన్ హరి హర వీరమల్లు పూర్తి చేస్తున్నారు. దర్శకుడు సుజీత్, హరీష్ శంకర్ చిత్రాలను పట్టాలెక్కించాల్సి ఉంది . మరోవైపు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష టైటిల్ తో భిన్నమైన మూవీ చేస్తున్నారు.
Powerful & Power Packed Combination #PSPK & #SDT project takes off today🤩
Storming updates on the way🌀💥#PKSDT@PawanKalyan @IamSaiDharamTej@thondankani @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth pic.twitter.com/3rxsd2rKas
— People Media Factory (@peoplemediafcy) February 22, 2023