
Anasuya Bharadwaj : అనసూయ ఇంట సందడి నెలకొంది. ఆమె చుట్టాలు పక్కాలు అందరూ వచ్చేసారు. ముఖ్యంగా తన అమ్మనాన్న తోపాటు అత్తా మామలు కలిసి రావడంతో అందరూ కలిసి మరీ ఎంజాయ్ చేశారు. అనసూయ సంప్రదాయబద్దంగా.. మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తూ చుట్టాలందరితో కలిసి ఆడిపాడింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
ఎప్పుడూ ఇటు టీవీల్లో, అటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే అనసూయ ఇప్పుడు తన ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసింది. అందరితో కలిసి ఆడి పాడింది.

ముఖ్యంగా అత్త, తల్లితో కలిసి అనసూయ ఇటీవల పాపులర్ అయిన ఓ దక్షిణాది తమిళ పాటకు వినసొంపుగా డ్యాన్స్ చేసింది. ఇక తన భర్త, పిల్లలతో కలిసి మురిపెంగా అల్లరి చేసింది.
ప్రస్తుతం అనసూయ ఎంజాయ్ మెంట్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ ఎంజాయ్ మామూలుగా లేదని.. ఇలా హ్యాపీగా ఉండాలంటూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.