Lionel Messi- Antonella Roccuzzo: ప్రతీ మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. చాలా మంది మగాళ్లు ఈ మాటంటే ఒప్పుకోరు. క్రెడిట్ తమదే అంటారు. ‘గృహలక్ష్మీ’ సీరియల్ లో లాంటి భర్త క్యారెక్టర్లు మరింతగా ఆడవాళ్లు తమ విజయం వెనుక లేరు అని గోల చేస్తారు. ఎవరు ఎంత గొంతు చించుకున్నా మగాళ్లను కంట్రోల్ లో పెట్టి విజయం దిశగా నడిపించే శక్తి ఆడవారికే ఉంటుంది. వారు ఇంట్లో గొడవలు పెట్టి మానసికంగా అశాంతి నింపితే ఆ మగాడి జీవితం సంకనాకిపోతుంది. ఆటలో.. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వాళ్లు రాణించలేరు. ఇంట్లో అంత ప్రశాంతత ఉండబట్టే తాను సినిమాల్లో రాణిస్తున్నానని మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా చెబుతున్న పరిస్థితి.

అర్జెంటీనాకు ఫుట్ బాల్ ప్రపంచకప్ అందించిన లియోనెల్ మెస్సీ లాంటి వారి విజయం కూడా ఆయన ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆయన ప్రాణస్నేహితురాలు ఉంది. స్నేహితురాలిగా మొదలైన వీరి పరిచయం ఇద్దరు బిడ్డలను కన్నాక పెళ్లిపీటల వరకూ సాగింది. మైదానంలో.. ప్రేమ ఆటలో లియో మెస్సీ విజయాల వెనుకున్నది ఆమెనే..
డిసెంబర్ 18న ప్రొఫెషనల్ సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు2022 ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకున్నప్పుడు మిలియన్ల మంది అభిమానులు అతని భార్య ఆంటోనెలా రోకుజో గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. మెస్సీ విజయాల వెనుక ఆమె ఉందన్న సంగతిని తెలుసుకున్నారు. ఈ జంటకు ప్రేమకథ ఉందని.. అది ఏ క్రీడాభిమానికైనా కిక్ నిస్తుందని తేలింది.
అర్జెంటీనాలో రోసారియో అనే చిన్న పట్టణమే మెస్సీ, రోకుజోల స్వస్థలం. చిన్నతనంలో వీరిద్దరూ స్కూల్లోనే కలివారు. ఆ తర్వాత ఫుట్ బాల్ అంటే పడిచచ్చే మెస్సీ తన సాకర్ కెరీర్ కు మెరుగులు దిద్దుకోవడానికి స్పెయిన్‌కు వెళ్లాడు. దీంతో అప్పటివరకూ ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరి మధ్య ఈ ఎడం ప్రేమను పెంచింది. ప్రేమించుకునేలా చేసింది.

2005లో రోకుజో ప్రాణ స్నేహితురాలు ఉర్సులా నాట్జ్ కారు ప్రమాదంలో మరణించింది. ఈ వార్త విన్న తర్వాత, మెస్సీ తన స్నేహితుడిని ఓదార్చడానికి స్పెయిన్ నుంచి ఏకంగా హుటాహుటిన అర్జెంటీనా లోని రోకుజో ఇంటికి తిరిగి వెళ్లాడు. అప్పుడే వీరిది గాఢమైన ప్రేమ బంధం అని అర్థమైంది. ఈ ప్రేమలోనే ఇద్దరు పిల్లలను కనేసిన జంట 2017లో పెళ్లి చేసుకొని ఒక్కటైంది. ప్రియురాలు కాస్తా తరువాత అతని భార్య అయ్యింది.
“నా భార్య ఆంటోనెలాలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి” అని మెస్సీ గతంలో తన మాజీ క్లబ్ ఎఫ్.సీ బార్సిలోనాకు ఆడుతున్నప్పుడు చెప్పాడు. “ఆమె రోజువారీగా ఎలా వ్యవహరిస్తుందో నేను నిజంగా మెచ్చుకుంటున్నాను, ఆమె ఎల్లప్పుడూ మంచి మానసిక స్థితితో ఉంటుంది. ఆమె సమస్యలను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఆమె చాలా తెలివైనది. జీవితంలోని అన్ని అంశాలలో నాకు చక్కగా గైడ్ చేస్తుంది.” అని మెస్సీ అన్నాడంటే అతడి కెరీర్ ను భార్య రోకుజో ఎలా తీర్చిదిద్దుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. తన విజయరహస్యం తన భార్యే అంటాడు మెస్సీ. వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా.. ప్రతీ సందర్భంలోనూ తన భార్య తన వెన్నంటి ఉంటుందని.. తననెంతో ప్రోత్సహిస్తుందంటూ మెస్సీ చెప్పుకొచ్చాడు. తనే నా గొప్ప చీర్ లీడర్ అని భార్య గురించి మెస్సీ గొప్పగా చెప్పాడు.
2017లో వివాహం చేసుకున్న ఈ జంటకు థియాగో( 10), మాటియో(7), సిరో(4 ) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
డిసెంబరు 18న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో మెస్సీ జట్టు అర్జెంటీనా .. ఫ్రాన్స్‌ను ఓడించిన తర్వాత, రోకుజో మరియు ఆమె ముగ్గురు కుమారులు మెస్సీతో కలిసి వేడుకలు చేసుకున్నారు. జీవితకాలం నిలిచిపోయే జ్ఞాపకాల కోసం మైదానంలోకి వచ్చి మరీ సందడి చేశారు.

“ఎలా ప్రారంభించాలో కూడా నాకు తెలియదు” అని రోకుజో విజయం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. “మీ పట్ల మేము ఎంత గొప్పగా గర్విస్తున్నాము మెస్సీ. ఎప్పటికీ వదులుకోవద్దని, మేము దానితో చివరి వరకు పోరాడాలని మాకు నేర్పినందుకు ధన్యవాదాలు. మీరు ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్నారు.” అని భర్తను రోకుజో కొనియాడారు. ఫైలన్ మ్యాచ్ జరిగినప్పుడు, మెస్సీ భార్య -ముగ్గురు పిల్లలు ఉత్సాహపరుస్తూ స్టేడియంలో సందడి చేశారు.
మెస్సీ భార్య ఒక మోడల్. వ్యాపారవేత్తగా ఎదిగారు. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ లో డిగ్ర పూర్తి చేసి ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేశారు. మెస్సీని పెళ్లి చేసుకున్నాక అతడి వ్యాపారాలు ఇంటి వ్యవహారాలకు పరిమితం అయ్యారు. అర్జెంటీ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన మెస్సీ విజయం వెనుక ఉన్నది ఈమెనే అని చాలా మంది పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.