https://oktelugu.com/

ఫాదర్స్ డే: రాంచరణ్ స్పెషల్ పిక్

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను నటుడు రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు ఒక మంచి క్యాప్షన్ పెట్టాడు. “మీతో సమయం ఎప్పటికీ విలువైనది.. !!! ఫాదర్స్ డే శుభాకాంక్షలు.” అని పేర్కొన్నాడు. తండ్రి – కొడుకు ఇద్దరూ కూడా నలుపు రంగు సేమ్ దుస్తులను ధరించి అలరించారు. ఈ ఫొటో మెగా అభిమానులకు కన్నుల విందు చేస్తోంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. రామ్ […]

Written By: , Updated On : June 20, 2021 / 07:03 PM IST
Follow us on

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను నటుడు రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు ఒక మంచి క్యాప్షన్ పెట్టాడు. “మీతో సమయం ఎప్పటికీ విలువైనది.. !!! ఫాదర్స్ డే శుభాకాంక్షలు.” అని పేర్కొన్నాడు.

తండ్రి – కొడుకు ఇద్దరూ కూడా నలుపు రంగు సేమ్ దుస్తులను ధరించి అలరించారు. ఈ ఫొటో మెగా అభిమానులకు కన్నుల విందు చేస్తోంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

రామ్ చరణ్ -చిరంజీవి ఒకరికొకరు ప్రస్తుతం కలిసి నటిస్తున్నారు. ఆచార్య మూవీలో రాంచరణ్ అతిధి పాత్రలలో నటించారు. ఈ సినిమాలోనే పూర్తి స్థాయి పాత్రలలో వీరిద్దరూ కలిసి చేస్తున్న మొదటి చిత్రం.

ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. వీరిద్దరూ త్వరలో ఆచార్య సెట్స్‌లో ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొని పూర్తి చేయబోతున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రానికి సహ నిర్మాత కావడం విశేషం.. ఇద్దరూ ఒకరికొకరు ఎలా పని చేస్తున్నారనే దానిపై కామెంట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.