https://oktelugu.com/

వ్యాక్సినేషన్ లో ఏపీ రికార్డు

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒక్క రోజే పది లక్షల మందికి టీకాలు వేసి సంచలనం రేపింది. ఆదివారం ప్రత్యేకంగా చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఏపీ ని దేశం మొత్తం చూసేలా చేసింది. దీని కోసం వైద్య ఆరోగ్య శాఖ అవిశ్రాంతంగా శ్రమించి ఈ రికార్డు సొంతం చేసుకుంది. మొత్తం పద్నాలుగు లక్షల డోసుల్ని జిల్లాలకు పంపి ఒక్క రోజే వాటిని ప్రజలకు వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏర్పాట్లు చేసి […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 20, 2021 / 07:22 PM IST
    Follow us on

    వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒక్క రోజే పది లక్షల మందికి టీకాలు వేసి సంచలనం రేపింది. ఆదివారం ప్రత్యేకంగా చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఏపీ ని దేశం మొత్తం చూసేలా చేసింది. దీని కోసం వైద్య ఆరోగ్య శాఖ అవిశ్రాంతంగా శ్రమించి ఈ రికార్డు సొంతం చేసుకుంది. మొత్తం పద్నాలుగు లక్షల డోసుల్ని జిల్లాలకు పంపి ఒక్క రోజే వాటిని ప్రజలకు వేయాలని నిర్ణయించారు.

    ఈ క్రమంలో ఏర్పాట్లు చేసి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకల్లా పది లక్షల మందికి టీకా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఏ రాష్ర్టం కూడా ఒకే రోజు పది లక్షల టీకాలు వేయలేదు. ఆరు లక్షల టీకాలు కూడా ఇవ్వలేదు.

    ఏీపీ సర్కారే గతంలో ఈ రికార్డును కూడా సృష్టించింది. ఒకే రోజు ఆరు లక్షల మందికి టీకాలు ఇచ్చింది. తమ రికార్డును తాము అధిగమించాలన్న లక్ష్యంతో ఈ సారి పది లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అంతకంటే ఎక్కువగానే టీకాలు సరఫరా చేశారు. కొద్దిరోజులుగా రాష్ర్టాలకు కేంద్రం టీకాలు పంపిణీ చేస్తోంది. పూర్తిగా ఉచితంగా మార్చిన తరువాత టీకాల సరఫరా ఎక్కువగా అయింది.

    ఇటీవల కాలంలో కేంద్రం పంపిన టీకాలన్ని నిల్వ ఉంచారు. కొద్దిరోజులుగా ఏపీలో చాలా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగడం లేదు. రికార్డు సృష్టించాలన్నఉద్దేశంతో అందరికి స్లిప్ లు ఇచ్చి ఆదివారం వేయించుకోవాలన్నారు. దాని ప్రకారం ఆదివారం రికార్డు స్థాయిలో టీకాలు పూర్తి చేశారు. ఏపీ సామర్థ్యాన్ని దేశానికి చాటి చెప్పారు.