Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Kuppam Tour: చంద్రబాబును ఏడిపించేస్తున్న జగన్‌.. మరీ ఇంత ప్రతీకారం వద్దబ్బా!

Chandrababu Kuppam Tour: చంద్రబాబును ఏడిపించేస్తున్న జగన్‌.. మరీ ఇంత ప్రతీకారం వద్దబ్బా!

Chandrababu Kuppam Tour: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా… అన్నట్లు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. చెలరేగిపోతున్నారు. రాష్ట్రానికి ఇప్పుడు నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షనేతగా తాను ఉన్నప్పుడు చంద్రబాబు పెట్టిన ఇబ్బందులను మనసులో పెట్టుకొని ఇప్పుడు జగన్ సాధిస్తున్నాడు. ఇప్పుడు నాకు టైం వచ్చిందని.. నేనూ ఓ ఆటాడుకుంటా అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. మూడున్నరేళ్లుగా ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ముప్పు తిప్పలు పెడుతున్న జగన్‌కు.. ఇప్పుడు చంద్రబాబు ఖర్మకాలి మరో అవకాశం దొరికింది. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన రెండు సభల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకున్న జగన్‌ సర్కార్‌ బాబు పర్యటనలు, సభలను అడ్డుకునేందుకు ఏకంగా జీవో జారీ చేసింది. రోడ్లపై, రద్దీ ప్రదేశాల్లో సభలు నిర్వహించొద్దనేది ఆ జీవో ఆంతర్యం. కానీ చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహిస్తున్నాడు కాబట్టే ఈ జీవో తెచ్చినట్లు అనిపిస్తోంది.

Chandrababu Kuppam Tour
Chandrababu Kuppam Tour

-అనుమతి ఇవ్వకుండా హైప్‌..
జగన్‌ తాను నిబందనల పేరుతో చంద్రబాబును అడ్డుకుంటున్నట్లు భావిస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే పరోక్షంగా బాబుకు మేలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఆంక్షల పేరుతో పోలీసులతో బాబాబును అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సర్కార్‌ పరోక్షంగా బాబుపై ప్రజల్లో సానుభూతి పెంచుతోంది. తాజాగా బాబు కుప్పం పర్యటనను అడ్డుకుంది జగన్‌ సర్కార్‌.

Chandrababu Kuppam Tour
Chandrababu Kuppam Tour

-బాధ్యత మరిచి..
ప్రభుత్వ జారీ చేసిన జీవో ప్రకారం చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నిబంధనకు విరుద్ధంగా పర్యటన ఉందని డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. కానీ, ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో సూచించాల్సిన బాధ్యత పోలీసులదే. కానీ దానిని విస్మరించారు. నోటీసులు ఇచ్చిన డీఎస్పీ సభ ఎక్కడ పెట్టుకోవాలో సూచించి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా బాబును కుప్పంలో ఎలా అడ్డుకోవాలి, ఎంతమంది పోలీసులను మోహరించాలి అనే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అంతటితో ఆగకుండా బాబు బెంగళూర్‌ ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గంలో కుప్పం వస్తుండగా అడ్డుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.

Chandrababu Kuppam Tour
Chandrababu Kuppam Tour

నోటీసులు ఇచ్చారు. దీంతో చంద్రబాబుకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ సభకు అనుమతి లేదు వెళ్లిపోవాలని డీఎస్పీ చంద్రబాబుకు సూచించగా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు అనుమతివ్వాలని బాబు పట్టుబట్టారు. డీఎస్పీ ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి కూడా చంద్రబాబు నిరాకరించారు. అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు తన కారులోనే కూర్చొని ఆందోళన తెలుపుతున్నారు.

మొత్తంగా జగన్‌ వ్యవహారం చూస్తుంటే… కక్షసాధింపు వినహా ఏమీ కనిపించడం లేదు. ఇలాంటి చర్యలు జగన్‌కు మేలు చేయకపోగా కీడు చేయడం ఖాయం అన్న అభిప్రాయం ఏపీ విపక్ష పార్టీల్లో వినిపిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular