Aging Problems: ఇటీవల కాలంలో మన జీవన శైలి మారుతోంది. యవ్వనంలో వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి. ఇరవైలోనే అరవైలా కనిపిస్తున్నారు. జుట్టు నెరవడం, ఊడిపోవడం వంటి చర్యలతో మనుషులు తమ కళ పోగొట్టుకుంటున్నారు. నలబైలోనే వృద్ధాప్యంగా కనిపిస్తున్నారు. ముఖంపై ముడతలు, తెల్లవెంట్రుకలు, మచ్చలు, చర్మం కాంతివంతంగా లేకపోవడం వంటివి తలెత్తుతున్నాయి. దీంతో పెరుగుతున్న వయసుతో ఛాయలు కూడా మారుతున్నాయి. మనం తీసుకునే ఆహారం కూడా మనకు ప్రతిబంధకంగా అవుతోంది. నలభైలో కూడా యవ్వనంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన తిండిని మార్చుకోవాల్సిందే.

మన చర్మం యవ్వనంగా కనిపించాలంటే మన ఆహారం కూడా మారాలి. మనం తినే తిండిలోనే ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. చర్మ సంరక్షణకు బొప్పాయి ఎంతో మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవడం మంచిది. ఇది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. దానిమ్మలో కూడా మనకు ఉపయోగపడే కొల్లాజెన్ ఉంటుంది. దీంతో కూడా మనకు వృద్ధాప్యం దరిచేరదు. నలభైలో కూడా ఇరవైలా కనిపించేందుకు దానిమ్మ కూడా సాయపడుతుంది.
క్యాబేజీ కూడా మంచి ఆహారమే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల సాయంతో వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. క్యారెట్ కూడా ఆరోగ్యకరమైన ఆహారమే. ఇందులో ఉండే బీటా కెరోటిన్ చెడు కొవ్వును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి రోజు క్యారెట్ ను తీసుకోవడం వల్ల వృద్ధాప్యం దరి చేరకుండా చేస్తుంది. ఇంకా ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి కూడా మనకు వృద్ధాప్యం రాకుండా చేస్తుంది. అనేక వ్యాధులను దూరం చేయడంలో ఇది ఎంతో సహకరిస్తుంది. ఆకుకూరలు కూడా మనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇందులో ఉండే క్లోరోఫిల్ చర్మంలో కొల్లాజెన్ ను పెంచి వృద్ధాప్యం దరిచేరకుండా నిరోధిస్తాయి. ఇలా మన ఆహారంలో మార్పులు చేసుకుంటే మనకు ముసలితనం కనిపించదు.

పెరుగు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ తో మనకు ఎన్నో లాభాలున్నాయి. శరీరంలోని మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిన్ యాసిడ్ ముడతలను రాకుండా చేస్తుంది. రంధ్రాలు నింపుతుంది. పెరుగులో ఉండే విటమిన్ బి12 చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇన్ని లాభాలున్న ఆహారాలను తీసుకుని మనకు వృద్ధాప్యం రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన అలవాట్లతోనే ముడిపడి ఉందని తెలుసుకుంటే సరి.
[…] […]