Okkadu Re Release: మామూలు హీరో గా ఉన్న మహేష్ బాబు ని స్టార్ హీరో గా మార్చిన చిత్రం ‘ఒక్కడు’..అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..గుణ శేఖర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా తెలుగు చలన చిత్ర కమర్షియల్ ఫార్మటు ని మార్చేసింది..మహేష్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది..ఈ సినిమా తర్వాత మహేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఎవ్వరు ఊహించని స్థాయికి వెళ్ళాడు.

ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాదు..హిందీ , తమిళం మరియు కన్నడ బాషలలో కూడా విడుదలైంది..తమిళ్ మరియు కన్నడ లో విజయ్, పునీత్ రాజ్ కుమార్ హీరోలుగా నటించారు..వాళ్ళిద్దరి రేంజ్ కూడా ఈ సినిమా తర్వాత నుండే మరో లెవెల్ కి వెళ్ళింది..అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని ఈనెల 7 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు..దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.
అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని ఒకసారి పరిశీలిస్తే చాలా డల్ గా ఉన్నాయి అనే చెప్పాలి..అమెరికా లో అయితే ఈ సినిమాకి అసలు ఏ మాత్రం డిమాండ్ లేకపోవడం తో అక్కడ విడుదల చేసుకోవడానికి బయ్యర్స్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు..ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి..విచ్చిలవిడిగా షోస్ అయితే వేయించుకున్నారు కానీ, టికెట్స్ అమ్ముడుపోక చాలా ఇబ్బంది పడుతున్నారు బయ్యర్స్..ఇప్పటి వరకు కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే పోకిరి స్పెషల్ షోస్ రికార్డుని కొట్టడం కూడా అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు..హైదరాబాద్ లో అయితే చాలా షోస్ ఆక్యుపెన్సీలు లేక క్యాన్సిల్ అయ్యాయి..ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ కి ఇది చాలా ఘోరమైన అవమానం అనే చెప్పాలి..ఇప్పుడు కాకుండా మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ఈ సినిమాని విడుదల చేసుకొని ఉంటే మంచి వసూళ్లు వచ్చేవని అంటున్నారు ట్రేడ్ పండితులు.