Car Driver Became A Software Engineer: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అని ఓ సినీకవి చెప్పారు. పట్టుదల ఉంటే కానిది లేదని పలు సంఘటనలు సైతం నిరూపించాయి. అతడో మామూలు వ్యక్తి. చదువుకోవడానికి సైతం సరైన డబ్బు లేక చదువు మధ్యలోనే ఆపేసినా తనలోని ఆలోచనలను మాత్రం వదిలేయలేదు. దీంతో జీవితంలో ఎదిగేందుకు శాయిశక్తులా ప్రయత్నాలు ప్రారంభించాడు. అనుకున్నదే తడవుగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. తనకంటూ ఓ స్థానం ఉండాలని భావించాడు. ఇందులో భాగంగానే అతడు తన ప్రతిభకు మెరుగుపెట్టి జీవితంలో అరుదైన స్థానం దక్కించుకోవడం విశేషం.

బిహార్ రాష్ట్రంలోని ముంగేర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ ఓ నిరుపేద విద్యార్థి. చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కానీ అతడి ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో అతడు స్నేహితుల సలహా మేరకు భోపాల్ వెళ్లాడు. అక్కడ డిప్లొమా కోర్సులో చేరినా ఫీజు కట్టలేని పరిస్థితి. దీంతో చదువు ముందుకు సాగలేదు.
Also Read: కొత్త బుల్లెట్ బండి వచ్చేసింది.. ఎన్ ఫీల్డ్ ‘స్క్రామ్ 411’ ఫీచర్లు, ప్రత్యేకతలివీ!
ఆశిష్ కారు డ్రైవింగ్ నేర్చుకుని క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేందుకు నిర్ణయించుకున్నాడు. ముసాయిలో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్ మెంట్ పై షార్ట్ టర్మ్ కోర్సు నేర్చుకునేందుకు చేరాడు. కోర్సు ముగించిన వెంటనే ఉద్యోగం కోసం కేవలం మూడు వారాలు మాత్రమే నిరీక్షించాడు. ఈ నేపథ్యంలో అతడి కోరిక నెరవేరే సమయం వచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం సంపాదించి అందరికి ఆదర్శంగా నిలిచాడు.
అనుకున్నది సాధించడంలో అతడు చూపిన తెగువ అసమాన్యమైనది. పట్టుదల ముందు ఎంతటి కష్టమైనా బలాదూరే అని నిరూపించాడు. పేదరికంలో ఉన్నా కోరికలు తీర్చుకోవడం కోసం పడిన శ్రమ వృథా కాలేదు. తాననుకున్నది సాధించే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అతడి ప్రయత్నం ఆగలేదు. ఉద్యోగం సాధించే వరకు విశ్రమించని అతని పట్టుదల చూసి అందరు పరేషాన్ అవుతున్నారు. ఆన్ లైన్ కోర్సులతో చదివి తన జీవితాశయం తీర్చుకోవంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కోర్సు పూర్తి చేసిన తరువాత అతడు ఓ రెండు మూడు ఇంటర్వ్యూలను ఎదుర్కొన్నాడు. అనుభం లేకపోవడంతో స్వల్ప విరామం తీసుకున్నా అతడి కోరిక తీరడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూనే చదువుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఎదగడం మామూలు విషయం కాదు. మొత్తం చదువుకే అంకితం చేసిన వారు సైతం నిరంతరం శ్రమిస్తున్నా ఉద్యోగాలు సాధించడం ఓ సవాలుగా మారిన సందర్భంలో పరిస్థితులను తట్టుకుని ఎదురు నిలిచి ఉద్యోగం సాధించడం గొప్ప విషయమే.
Also Read: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే