Nagababu: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున తెలుగు మరియు హిందీ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా మెగాస్టార్ కి థియేటర్స్ లో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి సన్నాహాలు ప్రారంభం అయ్యాయి..ఇదివరకు కనీవినీ ఎరుగని రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సెలెబ్రేషన్స్ చెయ్యాలని ఈ మీటింగ్ లో చెప్పుకొచ్చారు..ఈ ఈవెంట్ కి చిరంజీవి సీనియర్ ఫ్యాన్స్ తో పాటుగా మెగా బ్రదర్ నాగబాబు కూడా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..కొద్దో రోజుల క్రితం జరిగిన ఒక ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా గరికపాటి కూడా హాజరయ్యారు..ఆరోజు ఆయనని చిరంజీవిని అవమానించాడు..మెగాస్టార్ స్టేజి మీదకు రాగానే అందరూ సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు..ఆ సమయం లో గరికపాటి ఆవేశానికి గురై చిరంజీవి వెంటనే ఫోటో షూట్ ఆపి ఇక్కడకి రావాలి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అంటాడు.
దీనిపై మెగా ఫ్యాన్స్ అప్పట్లో చాలా రచ్చ చేసారు..ఆ తర్వాత గరికపాటి కూడా చిరంజీవి కి క్షమాపణలు చెప్తూ బహిరంగ లేఖ ఒకటి రాసారు..అయితే నిన్న జరిగిన అభిమానుల సమావేశం లో నాగబాబు ఈ అంశం పై మాట్లాడాడు..ఆయన మాట్లాడుతూ ‘అన్నయ్య చిరంజీవి కి ఉన్న మంచితనం ని చాలామంది అలుసుగా తీసుకొని ఆయనని అవమానించాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు..కానీ అన్నయ్య అన్నిటిని చిరు నవ్వుతో ఆహ్వానిస్తాడు.

కానీ ఆయన తమ్ముడిగా నేను ఊరుకోను కదా..కచ్చితంగా స్పందిస్తాను..కానీ ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ కి హాజరైన చిరంజీవి గారిని ఒక పెద్ద మనిషి (గరికపాటికి ఉద్దేశిస్తూ) చాలా అవమానించాడు..నాకంటే అభిమానులే ఎక్కువ రియాక్ట్ అయ్యారు..నువ్వు ఎంత పెద్ద తోపు అయితే మాకేంటి..నిన్ను మేము ఎపుడైనా అవమానించామా..గౌరవిస్తూనే వచ్చాము..అంత మంది ముందు నువ్వు అవమానించిన కూడా అన్నయ్య నీ పట్ల హుందాగానే ప్రవర్తించాడు..అది అన్నయ్య మంచి తనం’ అంటూ నాగ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.