Elopement Certificate: వైవాహిక బంధానికి సమాజంలో ఎలాంటి ధ్రువీకరణ అవసరం ఉండదు. తాము దంపతులం అని చెబితే అందరూ నమ్ముతారు. కానీ చట్టబద్ధమైన, ప్రభుత్వ అవసరాలు, బీమా, కోర్టులకు ధ్రువీకరణ తప్పనిసరి వైవాహిక బంధాన్ని ధ్రువపర్చే పత్రాలు ముఖ్యం. అదిలేకుంటే బంధానికి కూడా గుర్తింపు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు, పోలీసుల విషయంలో సర్టిఫికెట్ లేదా రికార్డులకే ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి సమస్యే మరణించిన సైనికుడి విషయంలో ఎదురైంది. దీనికోసం అతడి భార్య చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏడాదికిపైగా పోరాటం తర్వాత ఎలాప్‌మెంట్ సర్టిఫికెట్ ద్వారా దీనికి పరిష్కారం లభించింది.
ఏం జరిగిందటే..
మరణించిన ఓ సైనికుడి మొదటి భార్య తనకు విడాకులు ఇవ్వకముందే అతనిని విడిచిపెట్టింది. దీంతో అతను మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. తర్వాత అతను మరణించాడు. దీంతో ప్రభుత్వం నుంచి అతని కుటుంబానికి రావాల్సిన పరిహారం, బీమా, ఇతర బెనిఫిట్స్‌పై సందిగ్ధం ఏర్పడింది. మొదటి భార్య వదిలేసిందని, రెండో పెళ్లి చేసుకున్నాడని నిరూపించడానికి అతని రెండో భార్య అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆర్మీ రికార్డుల్లో అతని మొదటి భార్య పేరు ఉంది. ఆమె ఎక్కడ ఉందో తెలియదు. రెండో భార్య అతడితో ఉన్నా ఆమె వైవాహిక బంధం ధ్రువీకరించే సర్టిఫికెట్ లేదు. ఏడాదిపాటు ఆమే అనేక ఆటంకాలు ఎదుర్కొంది.
ఎలాప్‌మెంట్ సర్టిఫికెట్‌తో..
అనేక ఇబ్బందుల తర్వాత, న్యాయ సలహాల తీసుకుని చివరకు నాగ్‌పూర్‌లోని కాంప్టీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ బ్రాస్ నుంచి ఓ సర్టిఫికెట్‌ను రూపొందించాలనే ఆలోచన వచ్చింది. మరణించిన సైనికుడి మొదటి జీవిత భాగస్వామితో విడాకుల ప్రక్రియ లేకపోవడంతో ఆర్మీ రికార్డులలో ఏమీ మారలేదు. దీంతో తనకు ఏడాదిగా కుటుంబ పింఛన్ రావడం లేదని అధికారుల నుంచి క్లియరె¯Œ ్స పెండింగ్‌లో ఉందని తెలిపింది. దీంతో ‘రూల్ బుక్‌లో ఎలోప్‌మెంట్ సర్టిఫికేట్ కోసం ఎటువంటి నిబంధన లేనందున, కంటోన్మెంట్‌లోని అధికారులు మహిళను ఆర్మీ వితంతువుగా గుర్తించేలా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరకు మొదటి భార్య వదిలేసి పోయినట్లుగా (ఎలాప్‌మెంట్) సర్టిఫికెట్ జారీ చేశారు.
చట్టబద్ధత లేక సమస్యలు..
ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సైనికులు.. భార్యతో చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత లేదా ఆమె మరణం తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటేనే అతని తర్వాత కుటుంబ పెన్షన్ రెండో భార్యకు వెళ్తుంది. అది లేని పక్షంలో ధ్రువీకరణ పెద్ద సమస్యగా మారుతోంది. ఉత్తర మహారాష్ట్ర , గుజరాత్ సబ్–ఏరియాలోని వెటరన్స్ బ్రాంచ్ ఇటీవల ఎలోప్‌మెంట్ సర్టిఫికేట్‌పై అధికారిక ముద్రను పొందింది. 85 ఏళ్ల మాజీ సైనికుడు మరణించాడు. అతకు ముందే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి చట్టబద్ధంగా విడిపోలేదు. ఏడాది క్రితం అతను మరణించాడు. సైనిక రికార్డుల్లో అతడి మొదటి భార్య పేరు ఉంది. ఆమె ఎక్కడ ఉందో తెలియదు. రెండవ భార్య చట్టబద్ధమైన జీవిత భాగస్వామిగా గుర్తింపు లేదు. ఈ క్రమంలో రెండో భార్య చట్టబద్ధమైన హోదా పొందాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఎలాప్‌మెంట్(లేచిపోయిన సర్టిఫికెట్) ద్వారా రెండో భార్యకు చట్టబద్ధత దక్కింది. సర్టిఫికేట్ ప్రోఫార్మా మొదటి భార్య తన భర్తను విడిచిపెట్టి, విడాకుల కోసం సంప్రదించలేకపోయిందని ధ్రువీకరించింది. సైనికుడి రెండో వివాహం హిందూ మతాచారాల ప్రకారం జరిగిందని కూడా పేర్కొంది. ఎన్నికైన ప్రతినిధి తన ముద్ర వేయడంతో, రెండవ వివాహం చట్టబద్ధం చేయబడిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.