YS Sharmila : కాంగ్రెస్ వికృత క్రీడలో ఇంకెంత మంది సమాధి కాబోతున్నారో?

షర్మిల పతనం ఎక్కడ మొదలైంది..? ఒకే ఒక్క ఇన్సిడెంట్ తో ఆమె డౌన్ ఫాల్ స్టాట్ అయ్యింది. షర్మిల సహా కాంగ్రెస్ వికృత క్రీడలో ఇంకెంత మంది సమాధి కాబోతున్నారో? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 4, 2023 3:43 pm

YS Sharmila : వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్తానం తెలంగాణలో ముగిసిపోయింది. మొదలైంది అక్కడే.. అంతమైంది అక్కడే. అసలు ఈ రాజకీయ ప్రస్థానం మొదలయ్యిందే అననుకూల వాతావరణంలో మొదలైంది. అందరూ మొదలైనప్పుడు ఏం అనుకున్నారు.. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం ఏంటని ప్రతీ ఒక్కరూ మాట్లాడారు. గతంలో కూడా సమఖ్య వాదం కోసం ఇదే షర్మిల తిరిగింది. కానీ రాను రాను ఆ అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలు మార్చుకోగలిగారు. వేల కి.మీల పాదయాత్రలు, మంగళవారం సత్యగ్రహాలు, రానురాను ఆమె మీటింగ్ లకు జనాలు రావడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా కేసీఆర్ పై తెగించి పోరాడటం.. ఆమె పోరాటం తెలంగాణ ప్రజలను ఆకర్షించింది. ఆమెకు ఫాలోవర్స్ బాగా పెరిగారు.

కానీ ఒక స్థాయికి వచ్చేసరికి షర్మిలకు తెలంగాణ సమాజంలో ఒక ఇమేజ్ ఏర్పడింది. ఇవ్వాల మొత్తం పరువు పోయింది. ప్రతిష్ట పోయింది. ఆమె రాజకీయ ప్రస్థానం ఈ పద్ధతిలో ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.