Viral news : ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. అంతస్తుతో సంబంధం ఉండదు. ఆస్తితో సంబంధం ఉండదు. డబ్బుతో సంబంధం ఉండదు.. కేవలం మనిషి అనురాగాన్ని మాత్రమే కోరుకుంటుంది. ఆప్యాయతను మాత్రమే అంగీకరిస్తుంది. అటువంటి సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పైగా ఈ జంట ప్రేమకు వయస్సు సంబంధం లేదు అనే మాటను అక్షరాల నిజం చేసి చూపించండి.. అమెరికాలోని మార్జూరి పీటర్ మాన్ అనే మహిళకు 102 సంవత్సరాలు. ఆమెకు గతంలోనే పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలకు పెళ్లిళ్లయి.. వాళ్లకు కూడా పిల్లలు కలిగారు. మొత్తంగా ఆమె ముని మనవరాళ్లను, మనవాళ్లను చూశారు. వారిని ఎత్తుకొని ఆడించారు. అమెరికాలో మన మాదిరిగా ఉమ్మడి కుటుంబాలు ఉండవు. పైగా ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు ఎవరి దారి వారు చూసుకుంటారు. అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. కుటుంబాని కంటే వ్యక్తికే ఎక్కువగా విలువ ఉంటుంది. అయితే ఫిటర్ మాన్ కు గతంలోనే భర్త చనిపోయాడు. పిల్లలు ఎవరిదారి వారు చూసుకున్నారు.. దీంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఈ దశలోనే సరిగ్గా పది సంవత్సరాల క్రితం బెర్నీ లిట్ మాన్ పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో వారు గత పది సంవత్సరాలు నుంచి రిలేషన్ లో ఉంటున్నారు. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇవి మనలాంటి ప్రాంతాల్లో విడ్డూరం గాని.. అమెరికాలో ఆమోదయోగ్యమే. ముందుగానే చెప్పినట్టు అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు విపరీతమైన విలువ ఉంటుంది..లిట్ మాన్ కు కూడా గతంలోనే పెళ్లయింది. అతడిది కూడా ఫిటర్ మాన్ టైపు స్టొరీనే. ఒకే జాతి చెందిన పక్షులు.. ఒకే గూడు కింద ఉన్నట్టు వారిద్దరూ.. పరస్పరం ప్రేమించుకోవడం.. ఒకే దగ్గర ఉండి పోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
2024 లో..
2024లో లిట్ మాన్, ఫిటర్ మాన్ ఒక్కటయ్యారు. మే నెలలో స్నేహితులు, ఇరుపక్షాల కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగే నాటికి ఫిటర్ మాన్ కు 102, లిట్ మాన్ కు వంద సంవత్సరాలు. ఈ వివాహం ద్వారా వీరిద్దరూ ఓల్డెస్ట్ న్యూ లీ వెడ్ కపుల్ గా ఏకంగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ప్రకటించారు. “వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. గత పది సంవత్సరాలుగా వారు రిలేషన్ లో ఉన్నారు. తమ బంధాన్ని మరో దశకు తీసుకెళ్లడానికి వారు ఉత్సాహంగా ఉన్నారు. అందువల్లే గత మే నెలలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. పైగా ఈ వయసులో పెళ్లి చేసుకున్న వ్యక్తులుగా వారు నిలిచారు. అందువల్లే గిన్నిస్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకున్నారు. వారిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఒకడికి ఒకరు అన్నట్టుగా జీవిస్తున్నారు. వారి దాంపత్య బంధాన్ని చూస్తే ఆనందం కలుగుతోందని” గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు చెబుతున్నారు.