Relationship Tips : కాలేజీలో అబ్బాయిలు అమ్మాయితో మాట్లాడాలంటే ఏళ్లు పట్టే రోజులు పోయాయి. ఇప్పుడు స్కూల్ డేస్ నుంచే డేంజరస్ తరహా రొమాన్స్‌లు మొదలయ్యాయి. ఇప్పుడు మగపిల్లలు కాదు ఆడపిల్లలు పాఠశాలతో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ హద్దులు దాటడం మొదలుపెట్టారు. ప్రేమ, శృంగారానికి పూర్వం ఉన్న అర్థం ఇప్పుడు దాదాపుగా అదృశ్యమైంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో యువకులు శృంగార ఉత్సాహం కారణంగా సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిని ప్రేమించడం లేదా కేవలం ఒక వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండడంతో ఆగిపోవడం లేదు. ఇప్పుడు ఎంత మందితో ప్రేమలో పడాలి లేదా శారీరక సంబంధం పెట్టుకోవాలి అనే విషయంలో ఎలాంటి పరిమితి లేదు. ప్రపంచమంతటా ఇలా జరుగుతుందని కాదు కానీ అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఇలాగే జరగడం మొదలైంది. కానీ ఇంటర్నెట్ యుగంలో ప్రతి మూలకు ఈ ధోరణి వ్యాప్తి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో భారత్ కూడా వెనుకేం లేదు. మనకు కూడా ఈ పిచ్చి సంస్కృతి వచ్చింది.
న్యూయార్క్ టైమ్స్‌లోని ఓ నివేదిక అమ్మాయిలు తమ యుక్తవయస్సు నుంచే శృంగారం చేస్తున్నారని.. అందులో ప్రమాదకరమైన ఆటలు ఆడడం ప్రారంభించారని పేర్కొంది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక ప్రవర్తన ధోరణిపై పరిశోధన చేసిన డాక్టర్ హర్బెనిక్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా కాలేజీ విద్యార్థులలో ముఖ్యంగా యువతలో రఫ్ శృంగార ధోరణి వేగంగా పెరిగింది. ఇటీవల యూనివర్సిటీ క్యాంపస్‌లోని 5000 మందికి పైగా విద్యార్థుల మధ్య ఒక సర్వే నిర్వహించారు. ఇందులో మూడింట రెండు వంతుల మంది అమ్మాయిలు శృంగారంలో పాల్గొన్నారని తెలిసింది. వీరిలో 12 నుంచి 17 ఏళ్ల మధ్య వారే పాల్గొన్నారని తేలింది.
ప్రస్తుతం రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌లో నయా ట్రెండ్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం రిలేషన్ షిప్ కావాలనుకునే వారు వారి వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో కొత్త ట్రెండ్ వచ్చిది అదే DADT. అంటే డోన్ట్ ఆస్క్, డోన్ట్ టెల్. తమ బంధం హాయిగా, ఆనందంగా, చికాకుల్లేకుండా సాగిపోవడానికి పాశ్చాత్య దేశాల్లో చాలా జంటలు దీన్ని ఫాలో అవుతున్నాయి. తమ శృంగార, భావోద్వేగ జీవితాల గురించి డిస్కస్ చేసుకోకూడదని కొత్త బంధంలోకి అడుగుపెట్టే ముందే భాగస్వాములతో వీళ్లు మాట తీసుకుంటారు. అసూయ, వివాదాలకు తావుండదనే చాలా జంటలు DADT అనుసరిస్తున్నాయని తెలిసింది.