Taraka Ratna : తారకరత్నకు వాడిన ఎక్మో ను ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగిస్తారో తెలుసా?

Taraka Ratna : గుండె, ఊపిరి తిత్తుల పనితీరు పడిపోయినప్పుడు ఆర్టిఫిషియల్ గా సపోర్ట్ ఇవ్వడానికి ఎక్మో ను వాడతారు.. వైద్య రంగంలో ఇది చాలా ఖరీదుతో కూడుకున్న చికిత్సా విధానం.. అప్పట్లో బాలసుబ్రహ్మణ్యానికి, జయ లలితకు ఈ విధానంలో చికిత్స అందించారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇందుకు కోట్లల్లో బిల్లు అయింది.. వాస్తవానికి హార్ట్, లంగ్ సపోర్ట్ ఫెయిలై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ టెక్నాలజీ ద్వారా సపోర్ట్ చేస్తారు. ఈ పద్ధతిలో శరీరం […]

Written By: NARESH, Updated On : February 19, 2023 9:05 pm
Follow us on

Taraka Ratna : గుండె, ఊపిరి తిత్తుల పనితీరు పడిపోయినప్పుడు ఆర్టిఫిషియల్ గా సపోర్ట్ ఇవ్వడానికి ఎక్మో ను వాడతారు.. వైద్య రంగంలో ఇది చాలా ఖరీదుతో కూడుకున్న చికిత్సా విధానం.. అప్పట్లో బాలసుబ్రహ్మణ్యానికి, జయ లలితకు ఈ విధానంలో చికిత్స అందించారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇందుకు కోట్లల్లో బిల్లు అయింది..

వాస్తవానికి హార్ట్, లంగ్ సపోర్ట్ ఫెయిలై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ టెక్నాలజీ ద్వారా సపోర్ట్ చేస్తారు. ఈ పద్ధతిలో శరీరం నుంచి రక్తం తీసుకొని ఒక యంత్రం సహాయంతో ఎర్ర రక్త కణాలలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ తొలగించి ఆర్టిఫిషియల్ ఆక్సినైజేషన్ చేస్తారు. కోవిడ్, న్యు మోనియాతో బాధపడుతూ, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సస్టెన్ చేసేందుకు, వెంటి లేషన్ సరిపోని పేషెంట్లకు వాడతారు.

ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఒక ఇంటర్నేషనల్ కన్సార్టియం.. ఇందులో పని చేయని అవయవాలకి సపోర్ట్ ఇచ్చే ఎక్మో లాంటి థెరపీ ల డెవలప్మెంట్, టెస్టింగ్ లో శిక్షణ పొందిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, సైంటిస్ట్ లు ఉంటారు.

ఎక్మో లో రెండు రకాలు ఉన్నాయి. వీనో వీనస్ అంటే ఊపిరితిత్తులను మాత్రమే సపోర్టు చేస్తుంది. వీనో ఆర్టీరియల్ అంటే లంగ్స్, హార్ట్ ను సపోర్ట్ చేస్తుంది.. ఎక్మో సర్క్యూట్ ను పేషంట్ కు కనెక్ట్ చేసేందుకు ఒకటి నుంచి మూడు కాన్యులా లు వరకూ ఉపయోగిస్తారు.. సాధారణంగా పేషంట్ కుడి మెడ మీద సర్జన్ చిన్న కోత పెడతారు. అందులో నుంచి ఒక ట్యూబ్ ని జాగులర్ వెయిన్ లోకి పంపిస్తారు. ఒక్కోసారి అదే కోత ద్వారా రెండవ ట్యూబ్ కూడా పంపిస్తారు. ఇది కరోటిడ్ ఆర్టరీ లోకి వెళ్తుంది. ఈ ట్యూబ్స్ ను ఒక మిషన్ కు కనెక్ట్ చేస్తారు.. ఆ మిషన్ బ్లడ్ ను ఆక్సినైజేషన్ చేస్తుంది. ఒక్కోసారి, ఈ ట్యూబ్స్ ను నేరుగా ఏట్రియం లోకి కానీ అయోర్టా లోకి కానీ పంపిస్తారు.

ఎక్మో మొట్టమొదటిసారిగా ఎడ్మినిస్టర్ చేసినప్పుడు పేషంటుకు మత్తు ఇస్తారు. ప్యారలైజ్ చేస్తారు. కానీ, ఎక్మో లక్ష్యాల్లో ఏమిటంటే పేషంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత వారిని మత్తులో నుంచి లేపి వారిని కేర్ లో స్వాములను చేయడం.. అందుకే దీనికి ఎన్నో రిసోర్సులు కావాలి. అందుకే, అన్ని చోట్లా ఇది వాడడం కుదరకపోవచ్చు. మామూలు పరిస్థితుల్లో ఎక్మో వాడిన తర్వాత పేషెంట్స్ లేచి ఈ ఆర్టిఫిషియల్ సహాయంతో నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్మో వాడకంలో ఉన్న పెద్ద సమస్య దానికి కావలసిన రిసోర్సులే. కాకపోతే చాలా సమయం పడుతుంది.. గుండె సంబంధిత, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్న ప్రతి వారికి ఎక్మో వాడడం తగినది కాకపోవచ్చు.. క్రానిక్ డయాబెటిస్, హై బీపీ ఉన్న 75 సంవత్సరాల పేషంట్ కంటే కూడా ఇతర ఆరోగ్య సమస్యలు ఏవి లేని 40 సంవత్సరాల పేషంట్ కి ఎక్మో ఉపయోగపడుతుంది.. కానీ ఇదే తారకరత్న విషయంలో సక్సెస్ కాలేదు. 22 రోజులపాటు ఈ యంత్రం మీద ఉన్న ఆయన… చివరకు తుది శ్వాస విడిచారు.