IPL 2022: ఐపీఎల్ సందడి మొదలైంది. తొలి మ్యాచ్ లో చెన్నై, కోల్ కతా హోరాహోరీగా తలపడ్డాయి. చెన్నై తరుఫున బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఫీల్డ్ లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. వికెట్ తీశాక అతడి సంబరాలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా కోల్ కతాతో ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనూ బ్రావో డ్యాన్స్ వైరల్ అయ్యింది.

తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ తొలి మ్యాచ్ లో కోల్ కతాతో చెన్నై తలపడింది. కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ను ఔట్ చేసిన ఆనందంలో బ్రావో స్పెషల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ బౌలింగ్ చేసిన బ్రావో.. వెంకటేశ్ అయ్యర్ ను ఔట్ చేసి చెన్నైకి తొలి వికెట్ ను అందించాడు. ఈ క్రమంలోనే బ్రావో తనదైన శైలిలో చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగించింది.
తాజాగా కులదీప్ నాయక్ కు సంబంధించిన డ్యాన్స్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఊపేస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎంఎస్ ధోని (38 బంతుల్లోనే 50 నాటౌట్) చెలరేగడంతో ఈ మాత్రం స్కోరు సాధించింది.
అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రహానే (34 బంతుల్లో 44) టాప్ స్కోరర్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు.
Bravo's new celebration pic.twitter.com/M24LnOr8IK
— That-Cricket-Girl (@imswatib) March 26, 2022