Business Man Food: ప్రముఖ వ్యాపారవేత్తలు తీసుకునే టిఫిన్లు ఎలా ఉంటాయి?

Business Man Food: లక్షాధికారైనా లవణమన్నమేగాని బంగారం తినడు. తిండి విషయంలో ప్రతి వారు ఏవో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో వ్యాపారవేత్తలైతే ఇంకా మరీ ఎక్కువగా జాగరూకతలు తీసుకుంటారు. ఉదయం ఆహారంతో పాటు మధ్యాహ్నం ఏం తినాలి? సాయంత్రం పూట భోజనం దేనితో ముగించాలి అనే వాటిపై ఓ అవగాహన ఉంచుకోవాల్సిందే. ఇందులో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర తన ఆహార విషయంలో ఎన్నో నిబంధనలు పాటిస్తుంటారు. అల్పాహారంలో మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఉండేలా చూసుకుంటారు. […]

Written By: Srinivas, Updated On : March 27, 2022 4:39 pm
Follow us on

Business Man Food: లక్షాధికారైనా లవణమన్నమేగాని బంగారం తినడు. తిండి విషయంలో ప్రతి వారు ఏవో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో వ్యాపారవేత్తలైతే ఇంకా మరీ ఎక్కువగా జాగరూకతలు తీసుకుంటారు. ఉదయం ఆహారంతో పాటు మధ్యాహ్నం ఏం తినాలి? సాయంత్రం పూట భోజనం దేనితో ముగించాలి అనే వాటిపై ఓ అవగాహన ఉంచుకోవాల్సిందే. ఇందులో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర తన ఆహార విషయంలో ఎన్నో నిబంధనలు పాటిస్తుంటారు. అల్పాహారంలో మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఉండేలా చూసుకుంటారు. దీనికి గాను ఇడ్లీలను తమ ఆహారంలో భాగంగా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు.

Business Man Food

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తన ఆహార అలవాట్లలో అత్యంత చొరవ తీసుకుంటారు. ఆయన అలవాట్లు సాధారణంగానే ఉంటాయి. టిఫిన్ బాగుందనుకుంటే అవసరమైతే రోడ్డు పక్కన ఉంటే బండ్ల దగ్గరకు కూడా వెళ్లి తింటారని చెబుతుంటారు. ఎక్కువగా తన టిఫిన్ లో చపాతీ, దోశ లాంటివి ఉన్నా మధ్యాహ్న భోజనంలో సూప్, సలాడ్ లకే ప్రాధాన్యం ఇస్తారు. ఇడ్లీ సాంబార్ తన ఉదయం పూట ఆహారంలో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఇక వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కూడా తన ఆహార అలవాట్లు ప్రత్యేకంగా ఉంచుకుంటారు. ఉదయం పూట ఎలాంటి టిఫిన్ తీసుకోకున్నా కాఫీ తాగి మాత్రమే ఉంటారు. మధ్యాహ్నం భోజనం లేకున్నా చాక్లెట్ బార్ ను తినేస్తారట. రాత్రి భోజనంలో ఫ్రెంచ్ వంటకాలతోపాటు అమెరికన్ బార్బెక్యూ పదార్థాలు ఉండేలా చూసుకుంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ లో చాక్లెట్లను తగ్గించి ఆమ్లెట్ ను తినేందుకు నిర్ణయించుకున్నారు.

Also Read: గౌతంరెడ్డి స్థానంలో నిలిచేదెవరు?

అమెజాన్ వ్యవస్థాపకుడు జెప్ బెజోస్ తన అల్పాహారంలో ఆక్టోపస్ తో చేసిన ఏదో ఒక వంటకం ఉండాల్సిందే. దీంతో పాటు బేకన్లూ, గార్లిక్, పెరుగు, ఉడికించిన గుడ్లు, బంగాళదుంపలు ఉండేలా చూసుకుంటారు. అందుకే ఆయన చురుకుదనంతో ఉంటారని పలువురు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటే దాని పర్యవసానం కచ్చితంగా కనిపిస్తుందని చెబుతుంటారు.

కాలానుగుణంగా ఆహారం తీసుకోవడం మంచి అలవాటు. వేసవి కాలంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అందులో పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మసాలా, నూనెలు తక్కువగా వాడాలి. లేకపోతే ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. దీంతో మన శరీరం తట్టుకునే విధంగా ఆహారం కూడా ఉండాలి. అందుకోసం ప్రత్యేకంగా చొరవ చూపాల్సిందే. మంచి ఆహారంతోనే మన మనుగడ ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే తాను తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Also Read: జగన్ కేబినెట్ లో ఐదుగురు మహిళలకు చాన్స్.. రేసులో ఎవరంటే?

Tags