https://oktelugu.com/

Madhya Pradesh: తాళి కట్టే సమయంలో కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే అవాక్కే ?

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కనాడియా ప్రాంతంలో ఆర్య సమాజ్ గెస్ట్ లతో కళకళ లాడుతోంది. ఓ పెళ్లికి వచ్చిన వీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కాసేపట్లో తమకు తెలిసిన వారి పెళ్లి జరుగుతుందని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 19, 2023 / 11:58 AM IST

    Madhya Pradesh

    Follow us on

    Madhya Pradesh: పెళ్లంటే నూరేళ్ల పంట.. రెండు జీవితాలు ఒక్కటయ్యే వేదిక.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన ఈ తంతులో ఇటీవల ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న కారణాలతో వందేళ్ల వేడుకలు నిలిచిపోతున్నాయి.. మరికొన్ని విషాదంగా మారుతున్నాయి. లేటేస్టుగా మధ్యప్రదేశ్ లోనూ అదే జరిగింది. ఆనందంగా పెళ్లి జరుపుకోవాల్సిన వధూ వరులు పెళ్లి పీటలపైనే కొట్టుకున్నారు.. ఆ తరువాత విషం తాగారు.. మరి వారికి పెళ్లి ఇష్టం లేదా..? అబ్బాయంటే అమ్మాకికి పిచ్చి ప్రేమ.. మరి ఇలా ఎందుకు జరిగింది? అసలేం జరిగింది? వేడుకలా జరగాల్సిన ఆ మండపం విషాదంగా ఎందుకు మారింది?

    మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కనాడియా ప్రాంతంలో ఆర్య సమాజ్ గెస్ట్ లతో కళకళ లాడుతోంది. ఓ పెళ్లికి వచ్చిన వీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కాసేపట్లో తమకు తెలిసిన వారి పెళ్లి జరుగుతుందని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇక తాళి కట్టడమే తరువాయి. దీంతో వధూ వరులిద్దరూ పెళ్లి పీటలపై కూర్చున్నారు. ఆ తరువాత ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. జీవితంలో బంగారు బాట వేయాలనుకున్న వారు మాట్లాడుకోవడం చూసి అక్కడున్నవారు మురిసిపోయారు.

    కానీ అంతలోనే ఊహించిన సంఘటన.. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ తరువాత అది పెద్దదైంది. ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి కొట్టుకోవడం ప్రారంభించారు. పగవాళ్ల కంటే ఎక్కువగా వారు కొట్టుకోవడం చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఇంతలో వరుడు తన వెంట తెచ్చుకున్న విషాన్నితాగాడు. అది చూసిన వధువు తాను కూడా ఉండలేని అదే విషాన్ని తాగింది. దీంతో అక్కడున్నవారంతా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

    అప్పటికే వరుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వధువు ప్రస్తుతానికి చికిత్స పొందుతోంది. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పోలీసులు వివరాలను రాబట్టారు. అయితే అబ్బాయి తరుపున తల్లిదండ్రలు మాత్రం తమ కుమారుడిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయి ఒత్తిడి చేసిందని అన్నారు. అబ్బాయి మాత్రం జాబ్ లోసెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పారని, అయినా వినకుండా అమ్మాయే ఒత్తిడి చేసిందని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. పెళ్లిమండపంలో విషాదం నింపిన ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది.