spot_img
Homeట్రెండింగ్ న్యూస్Swetha Naagu: అరుదైన ‘శ్వేత’నాగు.. పడగవిప్పి ఇలా బుసకొట్టింది..

Swetha Naagu: అరుదైన ‘శ్వేత’నాగు.. పడగవిప్పి ఇలా బుసకొట్టింది..

Swetha Naagu: మనలో చాలా మందికి పాములంటే భయం. కొందరికి భక్తి ఉంటుంది. వాటిని చూస్తే పారిపోవడం ఖాయం. పాములంటే అంత భయం కలగడం సహజం. పూర్వ కాలం నుంచి వాటిని మనం దేవతలుగా కొలుస్తున్నాం. అందుకే నాగదేవత విగ్రహాలు వెలిశాయి. ఎదురుగా కనబడితే చాలా మంది మొక్కుతారు. దేవుడా నన్ను ఏం చేయొద్దు. నీ దారిన నువ్వు పో దేవుడా అంటూ వేడుకుంటారు. ఇలా పాములకు మనం ఇచ్చే ప్రాధాన్యం అలాంటిది.

నాగుల చవితి, నాగ పంచమికి పుట్టలో పాలు పోసి మొక్కుతుంటారు. మహిళలైతే ఈ పండుగలను వైభవంగా జరుపుకుంటారు. తమ కుటుంబాన్నికాపాడాలని పుట్టలో పాలుపోసి వేడకుంటారు. నాగదేవతకు నైవేద్యాలు పెడతారు. పాలు, గుడ్లు పెట్టి కాపాడు దేవుడా అంటూ ప్రార్థిస్తారు. ఇలా పాములకు మనకు అవినాభావ సంబంధం ఏర్పడింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో కురుచ్చి శక్తినగర్ లో ఓ శ్వేత నాగు స్థానికులకు కనిపించింది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. పాము తెల్లగా ఉండటం ఇదే మొదటి సారి చూడటం అని అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. జన్యులోపంతోనే ఇలా తెల్లగా ఉంటాయని చెప్పారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper