Abu Dhabi Big Ticket Raffle Winner: పొట్టకూటి కోసం ఆ యువకుడు అబుదాబి వెళ్లాడు. భవన నిర్మాణ సంస్థలో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి జీతం నెలకు రూ.50 వేలు లోపే. అటువంటి వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వినడానికి విచిత్రంగా ఉన్న లాటరీ రూపంలో ఆయనకు అద్రుష్టం వరించడంతో నెలవారి వేతనదారుడు ఏకంగా కోటీశ్వరుడయ్యాడు.దీనికి కారణం అతని కుమారుడి పుట్టినరోజు. అవును మీరు విన్నది నిజమే. కుమారుడి బర్త్‌డేనే అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన దక్షిణమూర్తి మీనాచిసుందరం(29) అనే వ్యక్తి గత 9 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. అక్కడ ఓ గృహనిర్మాణ సంస్థలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. నెలకు 2,500 దిర్హమ్స్(రూ.52వేలు) జీతం వస్తుంది.

కాగా, దక్షిణమూర్తి గత ఐదేళ్లుగా అబుదాబి బిగ్‌టికెట్ రాఫెల్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన కుమారుడి పుట్టిన తేదీ కలిసొచ్చేలా ఓ లాటరీ టికెట్ కొన్నాడు. తాజాగా అబుదాబిలో నిర్వహించిన వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలో అతడు కొనుగోలు చేసినా టికెట్ నంబర్‌కే లాటరీ తగిలింది. దాంతో ఏకంగా 5లక్షల దిర్హమ్స్(భారత కరెన్సీలో సుమారు రూ. 1.05కోట్లు) గెలుచుకున్నాడు. ఇలా కొడుకు బర్త్‌డే దక్షిణమూర్తికి అదృష్టాన్ని తెచ్చిపెట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా అవతరించారు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.
Also Read: Analysis on Narayana Arrest : నారాయణ అరెస్ట్ పై ఎన్నో అనుమానాలు?
ఈ సందర్భంగా దక్షిణమూర్తి మాట్లాడుతూ.. “9 ఏళ్ల నుంచి యూఏఈలో ఉంటున్నా. గడిచిన ఐదేళ్ల నుంచి క్రమం తప్పకుండా బిగ్‌టికెట్ రాఫెల్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాను. ఏదో ఒకరోజు నాకు అదృష్టం వరిస్తుంది, పెద్ద మొత్తం గెలుస్తాననే ఆశతో లాటరీ టికెట్లు కొంటూ వచ్చాను. చాలాసార్లు స్నేహితులతో కలిసి లాటరీ టికెట్లు కొన్నాను. కానీ, ఈసారి సొంతంగా నా కుమారుడి బర్త్ డేట్ కలిసొచ్చేలా లాటరీ టికెట్ నంబర్‌ను ఎంచుకున్నాను. ఇవాళ అదే నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.

మే 2వ తేదీన నేను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం. 065245 నన్ను విజేతను చేసింది. నా కుమారుడి పుట్టిన తేదీ 24-05-2021. లాటరీ టికెట్‌లోని చివరి మూడు నెంబర్లు 245.. నా కుమారుడి పుట్టిన తేదీలోని 24-5 ఒక్కటే. ఇదే లాజిక్‌తో లాటరీ టికెట్ కొనడం.. అది కాస్తా నన్ను విజేతను చేయడం జరిగిపోయాయి.” అని దక్షిణమూర్తి చెప్పుకొచ్చాడు. అతడి స్వస్థలం తమిళనాడులోని మదురై. ప్రస్తుతం భార్య, కుమారుడు భారత్‌లోనే ఉన్నారు. ఇప్పుడు తాను గెలిచిన ఈ భారీ మొత్తంతో తన జీవితమే మారిపోతుందన్నాడు. వెంటనే స్వదేశం నుంచి తన భార్య, కుమారుడిని యూఏఈకి తెచ్చుకుంటానని తెలిపాడు.