Pune Railway Station Police: ఖాకీ.. ఈ యూనిఫాం ప్రజల రక్షణ కోసమే. శాతిభద్రతల పరిరక్షణ కోసం.. కానీ కొంతమందికి ఆ యూనిఫాం ధరించగానే ఎక్కడ లేని అధికారం.. అహంకారం వచ్చేస్తుంది. తమను అడిగేవాడెడూ ఉండడు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వారితో ఆ డిపార్ట్‌మంట్ అంటేనే దూరంగా ఉండడం మంచిది అనే భావన ప్రజల్లో ఉంది. ప్రజల పన్నులతో వేతనాలు తీసుకునేవారు పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండాల్సి ఉండగా, వారిపైనే జులుం ప్రదర్శిస్తున్నారు. మర్యాదగా ఉండాల్సిన చోట అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే పూణే రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఓ పోలీస్ అధికారి నిర్వాకాన్ని వీడియో తీసిన ఓ ప్రయానికుడు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో తెగ చెక్కర్లు కొడుతోంది. సదరు అధికారి చేసిన తీరుతో ఆ డిపార్ట్‌మంటే విమర్శలు ఎదుర్కొంటోంది. ‘
నిద్రిస్తున్న వారిపై..
పుణెలోని రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న వారిపై ఓ పోలీస్ అధికారి సీసాలోని నీళ్లు చల్లుతూ నిద్రలేపుతున్నాడు. మానవత్వం మరిచి ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. ‘పుణె రైల్వే స్టేషన్’ అని క్యాప్షన్ ఇచ్చి ఓ నెటిజ¯Œ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోకు దాదాపు 13,800 లైక్‌లు రాగా.. 35 లక్షల మంది వీక్షించారు. అధికారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఓ రేంజ్‌లో అర్సుకుంటన్నారు.
అలసి సొలసి పడుకుంటే..
సాధారణంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు దూర ప్రయాణం చేసి అలసిపోయి రాత్రి వేళల్లో కాస్త కునుకు తీస్తారు. రెస్ట్ రూంలు ఉన్నా.. అవి చాలకపోవడంతో చాలా మంది ఖాళీ ప్రదేశాల్లో కుటుంబాలతో కలిసి నిద్రిస్తుంటారు. కొంతమంది రైళ్ల ఆసల్యంతో అక్కడే వేచి ఉంటారు. వారితో మర్యాదగా ప్రవర్తించాల్సిన అధికారులు అమర్యాదగా వ్యవహరించడమే విమర్శలకు కారణమవుతోంది.
అనుమానం ఉంటే..
ప్రయాణికుల్లో ఎవరైనా దొంగలు, అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారితో కూడా అమర్యాదగా ప్రవర్తించకూడదు. డౌట్ ఉంటే.. నిద్రలేపి ప్రశ్నించాలి. తనిఖీ చేయాలి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇది అవసరం. కానీ, ఇష్టానుసారం వ్యవరించడం సరికాదు.
స్పందించిన పూణే రైల్వే మేనేజర్..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రైల్వే పోలీస్ అధికారి వీడియోపై పుణె రైల్వే మేనేజర్ ఇందు దుబే స్పందించారు. ‘ప్లాట్‌ఫ్లామ్‌పై పడుకోవడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీనిపై ప్రయాణికులకు సరైన రీతిలో అవగాహన కల్పించాలి. అంతేకానీ ఇలా అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఈ సంఘటన తీవ్రంగా బాధిస్తోంది’ అని పోస్టు చేశారు.
https://twitter.com/i/status/1674710934894571525