Tholiprema Re Release Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ చిత్రం ‘తొలిప్రేమ’ విడుదలై 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఇటీవలే 4K టెక్నాలజీ కి మార్చి రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రీ రిలీజ్ లోను అద్భుతాలు సృష్టిస్తూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంది.మొదటి రోజు ఈ చిత్రానికి కొత్త సినిమాకి వేసినట్టు గా 8 గంటల ఆటలను ప్రదర్శించారు.
ఇవి కూడా హౌస్ ఫుల్స్ అయ్యాయి, ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. భారీ స్థాయి లో పబ్లిసిటీ చేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టి సెలెబ్రిటీలను పిలిచినా జనాలను రీ రిలీజ్ సినిమాలకు కదిలించడం కష్టం అయిపోతుంది. అలాంటి సమయం లో అసలు అభిమానుల ప్రొమోషన్స్ సహాయం ఏమాత్రం లేకపోయినా కూడా ఈ చిత్రానికి మొదటి రోజు కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది.
మొదటి రోజు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇలాంటివి అన్నీ కామన్ కదా, ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు అని మీకు అనిపించొచ్చు, కానీ పాతికేళ్ల క్రితం విడుదలైన ఒక సినిమాకి రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి అంటే సాధారణమైన విషయం కాదు కదా. ఈ చిత్రానికి ఇప్పుడు ఇదే జరుగుతుంది. నిన్న ఈ సినిమాకి హైదరాబాద్ లో 50 కి పైగా షోస్ వేస్తె అందులో 40 కి పైగా షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.
కొత్తగా విడుదలైన స్పై మరియు ‘సామజవరగమనా’ వంటి సినిమాల కంటే కూడా ఈ ‘తొలిప్రేమ’ చిత్రానికే హౌస్ ఫుల్స్ పడడం ఆశ్చర్యానికి గురి చేస్టున్న విషయం. రెండవ రోజు 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజు 18 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టు చెప్తున్నారు. మొత్తం మీద మూడు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందట.