Car Driving Rain: వర్షాకాలంలో వాహనాన్ని నడపడం ఎంతో సవాలతో కూడుకున్న పని. అస్తవ్యస్తంగా ఉన్న మన రోడ్లు డ్రైవింగ్ ను మరింత ఇబ్బందికరంగా చేస్తాయి. రోడ్లపై ఏర్పడిన గుంటలలో భారీగా నిలిచిపోయిన వర్షపు నీరు కారణంగా కార్ లేదా ద్విచక్ర వాహనం డ్రైవ్ చేసే సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం ఎదురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
ఈ సీజన్లో రోడ్లపై ఎక్కువగా నీరు నిలబడిపోతుంది. ఇలా తడిగా ఉన్న రోడ్లపై వెహికల్ ని కంట్రోల్ చేయడం లేదు అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేయడం ఎంతో కష్టం.అలాంటి రోడ్లపై డ్రైవింగ్ చేసే సమయంలో ఏ కాస్త అదుపుతప్పినా బండి బోల్తా పడే అవకాశాలు ఎక్కువ.
కొన్నిసార్లు వర్షం కారణంగా మన ఎదురుగా ఉన్న రోడ్డు కూడా సరిగ్గా కనపడని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇటువంటి సవాలతో కూడుకున్న వాతావరణంలో వెహికల్స్ ను సేఫ్ గా ఎలా నడపొచ్చు అనేది తెలుసుకుందాం పదండి.
స్లో డ్రైవింగ్
మూవీలో చూపించినట్టుగా ఫాస్ట్ గా డ్రైవ్ చేయాల్సిన అవసరం మనకైతే ఉండదు. అలా ఫాస్ట్ డ్రైవింగ్ చేయడం అనేది చాలా సార్లు ప్రమాదానికి దారి తీస్తుంది. అది వర్షాకాలం తడిచిన రోడ్లపై అధిక వేగంతో వెళితే కచ్చితంగా ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది. అందుకే ఈ సీజన్లో కారును నెమ్మదిగా నడపడమే శ్రేయస్కరం. కార్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు సడన్గా అవసరమై బ్రేక్ వేసిన బండి నిదానంగా ఆగుతుంది తప్ప బోల్తా పడే అవకాశం ఉండదు.
బ్రేక్ చెక్
తడిగా ఉన్న రోడ్లపై బ్రేకులు అంత సులభంగా పడవు. మీరు బాగా గమనించినట్లయితే పొడిగా ఉన్న రోడ్లతో పోల్చుకుంటే తడి రోడ్లపై వెహికల్స్ ఆగే డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రేక్ సిస్టం లో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఎప్పుడైనా ప్రమాదమే కాబట్టి సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ బ్రేకులు రెగ్యులర్ గా చెక్ చేయించుకోవాలి. వర్షాకాలం ఎప్పుడు కూడా బండిని రెగ్యులర్ గా సర్వీస్ ఇస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బండి కండిషన్ లో ఉండడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తగ్గుతుంది.
.రెగ్యులర్ టైర్స్ చెక్
వర్షాకాలంలో రోడ్లు ఎక్కువగా తడిగా ఉండటం వల్ల జారే అవకాశం ఉంటుంది. మీ కారు టైర్లు పూర్తిగా అరిగిపోయి ఉన్నట్లయితే వర్షాకాలం రోడ్లపై ఇవి ఎక్కువగా జారుతాయి. మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు గ్రిప్ కూడా ఉండదు, బ్రేక్ వేసిన ప్రాంతంలో ఆగకుండా వెహికల్ కాస్త ముందుకు వెళ్లి ఆగడం ఎక్కువగా జరుగుతుంది. మరి రోడ్డు స్లిప్పర్ గా ఉంటే మాత్రం వెహికల్ కంట్రోల్ తప్పి బోల్తా పడుతుంది.
వర్షాకాలంలో తడిచిన రోడ్ల పై ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించాలి అంటే మీ కారు టైర్ కరెక్ట్ కండిషన్ లో ఉండాలి. కాబట్టి రైనీ సీజన్లో రెగ్యులర్ గా మీ వెహికల్ ని చెక్ చేయడంతో పాటు అవసరమైతే తక్షణమే కొత్త టైర్లను రీప్లేస్ చేయాలి.