Mrunal Thakur: ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కాలం మారే కొద్ది మరుగున పడాల్సిందే. ఈ విషయం హీరోయిన్ల విషయంలో మరీ ముఖ్యంగా వర్తిస్తుంది. అందుకే హీరోయిన్లు దీపం ఉండేటప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను పాటిస్తూ ఉంటారు. సావిత్రి, వాణిశ్రీ లాంటి వారి తర్వాత వచ్చిన ఎంతోమంది హీరోయిన్లు కొద్ది సంవత్సరాలు మాత్రమే తెలుగు ఇండస్ట్రీలో నిలబడగలిగారు.
సౌందర్య, రమ్యకృష్ణ, సిమ్రాన్, మీన ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తారాజువ్వలు లాగా ఎదిగినా కానీ ఆ తరువాత జనరేషన్ హీరోయిన్స్ అయిన ఆర్తి అగర్వాల్, శ్రియ వచ్చేతప్పటికి వారి హీరోయిన్ల పొజిషన్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇలా ఒక జనరేషన్ హీరోయిన్లను మరో జనరేషన్ హీరోయిన్లు రీప్లేస్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఈ సంవత్సరం 2023లో ఒక జనరేషన్ నుంచి హీరోయిన్స్ విషయంలో మనం మరో జనరేషన్ కి రానున్నామేమో అనిపిస్తోంది. ఎందుకు అంటే మొన్నటి వరకు తెలుగు సినిమాల్లో సునామీ సృష్టించిన సమంత, రష్మిక మందాన, పూజా హెగ్డేలాంటి హీరోయిన్లు ప్రస్తుతం ఆఫర్లు లేక సతమతమవుతున్నారు.
అయితే వీరి ప్లేస్ లో కృతి శెట్టి, మృనల్ ఠాకూర్, శ్రీ లీలా వంటి వారు దూసుకుపోతున్నారు. శ్రీ లీల అయితే ఏకంగా తొమ్మిది సినిమాలు అంగీకరించి బ్యాక్ టు బ్యాక్ బిజీ హీరోయిన్ గా మారింది. ఇక ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన ఇద్దరు హీరోయిన్లు ఎవరు అంటే రష్మిక మందాన మరియు మృనల్ ఠాకూర్.
సీతారామం సినిమాలోని సీతా క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్, అక్కడ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు చేస్తున్నా కానీ తెలుగులో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ కనిపిస్తోంది. అందుకే సీతారామం తరువాత చాలా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోకుండా ఫైనల్ గా నాని 30వ సినిమా అయినా హాయ్ నాన్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా కూడా సీతారామం లాగా ఎమోషనల్ రైడ్ చిత్రమని అలానే ఈ సినిమాలో కూడా మృణాల్ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనదని తెలుస్తోంది.
అయితే ఈ హీరోయిన్ కెరియర్ కి పునాది వేసింది మాత్రం సీతారామం చిత్రమే. కానీ ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్రంపై పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అప్పటికి దర్శకుడు హను రాఘవపూడి కూడా పడి పడి లేచే మనసు లాంటి ఫ్లాప్ సినిమా చేసి మంచి హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దుల్కర్ సల్మాన్ కి మహానటి మరియు కనులు కనులను దోచాయంటే లాంటి సూపర్ హిట్లు ఉన్నా, ఆయన ప్రసన్స్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెద్దగా పెంచలేదు.
అయితే ఏ ముహూర్తాన ఈ సినిమాలో రష్మిక మందాన కూడా ఉంది అని తెలిసిందో ఆ సమయంలో ఈ సినిమాపై ప్రేక్షకులకు మంచి ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయ్యాయి. అప్పటికి రష్మిక స్టార్ హీరోయిన్ స్టేటస్ లో ఉండడంతో, సినీ ప్రేక్షకులు అలానే ఆమె అభిమానులు సీతారామం చిత్రంపై అంచనాలు పెంచుకున్నారు.
ఒక సాధారణ డైరెక్టర్ అలానే సౌత్ ఇండియాలో మొదటి సినిమా చేస్తున్న హీరోయిన్ ఉన్న సినిమా అయినప్పటికీ, రష్మిక ఈ చిత్రాన్ని ఒప్పుకుంది. అంతేకాదు ఈ సినిమాలో మృణాల్ కారెక్టర్ ఎక్కువగా ఉన్నా కానీ, రష్మిక అవి ఏవి ఆలోచించకుండా ఆ చిత్రానికి సైన్ పెట్టింది. అయితే ఇప్పుడు ఆ సినిమానే రష్మిక కొంప ముంచింది.
సీతారామం బ్లాక్ బస్టర్ తరువాత ప్రస్తుతం రష్మిక బదులు కొన్ని సినిమాలలో మృణాల్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారట. రష్మిక కెరియర్ లో గీతాగోవిందం ఎలాంటి సూపర్ హిట్ సినిమానో మన అందరికీ తెలుసు. ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించగా విజయ దేవరకొండ హీరోగా నటించాడు. ఇక ఈ పరశురామ్, విజయ దేవరకొండ కాంబినేషన్ లోనే మరో సినిమాని ఈ మధ్యనే ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. అయితే ఈ ప్రకటన రాగానే అందరూ ఈ చిత్రంలో రష్మికనే హీరోయిన్ అని కూడా కన్ఫామ్ అయిపోయారు. ఎందుకు అంటే విజయ్ దేవరకొండ మరియు రష్మిక జంట తెలుగులో ఎంత ఫేమస్ జంట అనేది మన అందరికీ తెలిసిందే. మరోసారి గీతాగోవిందం కాంబినేషన్ స్క్రీన్ పైన రానుంది అని తెగ ఆనందపడిపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమాలో ఇప్పుడు రష్మిక ని కాకుండా మృణాల్ ని తీసుకున్నారు ఈ చిత్ర నిర్మాతలు.
ఇక దినికన్నా రష్మిక కి పెద్ద షాక్ ఉండదేమో. మొత్తానికి పోనీలే అని స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో కూడా సీతారామం సినిమాలో తక్కువ నిధివి ఉన్న పాత్రలో చేసిన రష్మిక కి, ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నుంచి పెద్ద దెబ్బ ఎదురైంది మరి.