Akira Toriyama: డ్రాగన్ బాల్.. కార్టూన్ ఛానల్ ఇష్టపడే వారికి ఆ పదం సుపరిచితం.. జపాన్ లో డ్రాగన్ బాల్ సిరీస్ అంటే చాలామంది చెవి కోసుకుంటారు. దీనిని అకిరా తోరియామా సృష్టించాడు. ఈ డ్రాగన్ బాల్ ద్వారా అక్కడ అతడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఈ డ్రాగన్ బాల్ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన కథలు సూపర్ హిట్ అయ్యాయి. దీనిని పుస్తకంగా కూడా రూపొందించారు. ఆ పుస్తకాలు కూడా విపరీతంగా అమ్ముడుపోయాయి. డ్రాగన్ బాల్ లో ఉన్న కాల్పానిక చరిత్ర చాలామంది అభిమానాన్ని చూరగొంది. అందుకే జపాన్ దేశంలో నెంబర్ వన్ సెల్లింగ్ బుక్ గా, నెంబర్ వన్ కామిక్ సిరీస్ గా నిలిచింది. దీన్ని రూపొందించిన అకిరా తోరియామా(68) మార్చి 1న తీవ్రమైన రక్తస్రావం కారణంగా మరణించారు.. కాగా, ఈ విషయం. మార్చి 8న వెలుగులోకి వచ్చింది.
అకిరా తోరియామా మరణించడంతో జపాన్ దేశంలో విషాదం నెలకొంది. వన్ పీస్ మంగా సృష్టికర్త ఐచిరో ఓడా, నరుటో సృష్టికర్త మసాషి కిషీ మోటో సంతాపం వ్యక్తం చేశారు. అకిరా తోరియామా అతడికి జపనీస్ మాంగా అంటే ఇష్టం. అందులో ప్రావీణ్యం సంపాదించడంతో కళాకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ మాంగా నే అతడిని డ్రాగన్ బాల్ సృష్టించే దిశగా అడుగులు వేయించింది. దీనికి చైనీస్ కాల్పానిక సాహిత్యాన్ని అకిరా తోరియామా జోడించడంతో జపాన్ ప్రజల ఆదరణ పొందింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డ్రాగన్ బాల్ సిరీస్ అంటే చెవి కోసుకునే వారంటే అతిశయోక్తి కాదు. పైగా ఇందులో పాత్రలు జపాన్ యోధులను పోలి ఉండటంతో అక్కడి ప్రజలు దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. డ్రాగన్ బాల్ ను ఆదర్శంగా తీసుకొని జపాన్ దేశంలో వందలకొద్దీ హౌస్ స్థాయికి ఆదర్శంగా తీసుకొని జపాన్ దేశంలో ఔత్సాహిక దర్శకులు వందలకొద్దీ కామిక్ సిరీస్ లు రూపొందించారంటే దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
అకిరా తోరియామా కు ఎటువంటి వ్యాధులు లేవు. ఆయన 68 ఏళ్ళ వయసులోనూ చురుగ్గా పనిచేసేవారు. మాంగా నేపథ్యంలో మరో కొత్త సిరీస్ కు త్వరలో శ్రీకారం చుడతానని ఇటీవల ప్రకటించారు. కానీ హఠాత్తుగా సబ్ డ్యూరల్ హెమ టోమా వల్ల ఆయన మెదడులో తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో ఆయన మృతి చెందారు. మార్చి 1న ఆయన మృతిచెందగా.. ఈ విషయం మార్చి 8న వెలుగులోకి వచ్చింది. అకిరా తోరియామా మరణం పట్ల వన్ పీస్ సృష్టికర్త ఐచిరో ఓడా, నరుటో సృష్టికర్త మసాషి కిషిమోటో సంతాపం వ్యక్తం చేశారు. తమలో అకిరా తోరియామా స్ఫూర్తి నింపారని కొనియాడారు.