https://oktelugu.com/

Bhimaa Movie Review: భీమా మూవీ రివ్యూ…

హర్ష డైరెక్షన్ లో భీమా అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం...

Written By:
  • Gopi
  • , Updated On : March 9, 2024 / 12:13 PM IST

    Bhimaa Movie Review

    Follow us on

    Bhimaa Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కటౌట్ చూడగానే హీరో అనిపించే వాళ్ళలో గోపీచంద్(Gopichand) ఒకరు. ఈయన వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు కానీ సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు. దానికి కారణం ఏంటి అనే విషయం మీద కూడా ఆయన చర్చించుకుని మరి కొంచెం వైవిధ్యమైన కథాంశంతో రావాలని చూశాడు. ఇక అదే ప్రయత్నంతో హర్ష డైరెక్షన్ లో భీమా అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

    కథ

    ముందుగా ఈ కథ విషయానికి వస్తే పరుశురామ క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మన హీరో వచ్చి అక్కడ జరిగే అన్యాయాలను ఎలా ఎదుర్కొన్నాడు.ఆ రౌడీ లు హీరో ని ఎందుకు టార్గెట్ చేశారు. అసలు హీరోకి పరుశరామ క్షేత్రానికి మధ్య సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే గోపీచంద్ ఒక మంచి సినిమాలో నటించినప్పటికీ ఇందులో వైవిధ్యమైన అంశాను మేళవించలేక పోయారు. దర్శకుడు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లిన విధానం ఒకే అనిపించినప్పటికీ అది ఎక్స్ ట్రా ఆర్డినరీ వే లో అయితే లేదు. నిజానికి గోపీచంద్ లాంటి ఒక కటౌట్ ని పెట్టుకొని ఒక మంచి అటెంప్ట్ అయితే చేయొచ్చు కానీ భీమా లాంటి ఒక రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్లే సినిమానే తీస్తున్నారు. ఇక దీంట్లో కథకి చాలా స్కోప్ ఉంది. అయినప్పటికీ దర్శకుడు దీనిని రొటీన్ వే లో నడిపించాడు. మొదట సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలు చాలా ఎంగేజింగ్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది. మనం ఎందుకు ఈ సినిమాకి వచ్చామా అనేంత ఇబ్బంది కూడా కలుగుతుంది. కానీ కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం బాగానే తెరక్కెక్కించారు. అయినప్పటికీ మొదటినుంచి చివరి వరకు సినిమాని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు చాలా వరకు ఫెయిల్ అయ్యాడు.

    దైవం, ప్రేతాత్మ, భూతం లాంటివి ఆడ్ చేయకుండా సినిమాని కమర్షియల్ వే లో తీసుకెళ్లిన కూడా ఈ సినిమా ఒక మంచి అటెంప్ట్ గా మిగిలిపోయేది. కానీ అలా తీస్తే రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ లో అవుతుందనే ఉద్దేశ్యం తో దైవభక్తి లాంటివి యాడ్ చేసి మరి ఈ సినిమాను తీశారు. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుడిని ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. కొన్ని సీన్లలో గోపీచంద్ యాక్టింగ్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లలో మాత్రం సెంటిమెంట్ సీన్లు మరి మెలో డ్రామాగా మారిపోయాయి. దర్శకుడు రైటింగ్ స్టేజ్ లోనే వీటన్నింటికీ చెక్ పెట్టి ఉంటే ఒక బెస్ట్ అవుట్ ఫుట్ అయితే బయటికి వచ్చేది. ఇక హీరోయిన్లు అయినా మాళవిక శర్మ, ప్రియ భవాని శంకర్ లా పరిస్థితి మరి దారుణంగా ఉంది. వాళ్ళు హీరోయిన్ గా ఉన్నారు అంటే ఉన్నారు అంతే.. వాళ్ళకి స్పెషల్ గా ఒక క్యారెక్టర్ ని మాత్రం దర్శకుడు రాయలేకపోయాడు. ఇక ఈ సినిమా కంప్లీట్ కమర్షియల్ జోన్ లోనే వెళ్తుంది. కామెడీ గాని, యాక్షన్ ఎలివేషన్స్ గాని కొన్ని కొన్ని పర్లేదు అనిపించినప్పటికీ సినిమా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ సినిమాలో మేటర్ అయితే లేదు అనిపిస్తుంది. సినిమా చూసి ప్రేక్షకులు బయటకు వచ్చినా వెంటనే ఓకే అనిపిస్తుంది. తప్ప ఇంకోసారి చూడాలి అనేంత ఇంట్రెస్ట్ అయితే కలిగించదు. గోపీచంద్ ప్రతిసారి ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నాడో ఈ సినిమాలో కూడా అదే మిస్టేక్ చేశాడు. నాసిరకమైన కథలను ఎంచుకొని తను సినిమాలు చేయడం వల్లే ఈరోజు ఆయన హిట్స్ లేకుండా ఫ్లాప్స్ లను అందుకుంటున్నాడు…

    ఇప్పటికైనా గోపీచంద్ బుద్ధి తెచ్చుకొని డిఫరెంట్ అటెంప్ట్ లని ట్రై చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో వచ్చిన సాహసం సినిమా చాలా బాగుంటుంది. కానీ గోపీచంద్ అలాంటి సబ్జెక్టుని మళ్ళీ ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదో అర్థం కావడం లేదు. సాహసం గోపీచంద్ కెరీయర్ లోనే ఒక బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. అలాంటి పాత్రలో ఇప్పటివరకు గోపీచంద్ మళ్లీ ట్రై చేయలేదు. అలాంటి అటెంప్ట్ లను చేస్తేనే సినిమాలు సక్సెస్ అవుతాయి అనే ఒక చిన్న విషయాన్ని ఆయన గమనించి ముందుకెళ్తే బాగుంటుంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్ విషయానికి వస్తే గోపీచంద్ రెండు పాత్రల్లో అదరగొట్టాడనే చెప్పాలి. ఏ పాత్రకి ఆ పాత్రలో ఉన్న వేరియేషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గా మాత్రం అదరగొట్టడనే చెప్పాలి. గోలీమార్ సినిమా తర్వాత ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చాలా చక్కని నటనతో మెప్పించాడు… ఇక హీరోయిన్లు ఉన్నారు అంటే ఉన్నారు వాళ్ళ పాత్రలు ఓకే అనిపించినప్పటికీ ప్రియ భవాని శంకర్ క్యారెక్టర్ ఇంకొంచెం డెప్త్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ వాళ్లకు వచ్చిన క్యారెక్టర్ ని బాగానే వాడుకున్నారు… వెన్నెల కిషోర్ తన కామెడీతో కొద్దిసేపు గిరిగింతలు పెట్టినప్పటికీ ఆయన క్యారెక్టర్ని ఫుల్ లెంత్ మైంటైన్ చేసి ఉంటే త్రిల్ ఫీల్ అయ్యేవాడు…ఇక మిగిలిన ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ రవి బసురుర్ ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ పెద్దగా బాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ సినిమా మొత్తానికి మాత్రం బిజిఎం ని అంత ఎఫెక్టుగా ఇవ్వలేకపోయాడు…ఇక సినిమాటోగ్రాఫర్ అయినా స్వామీజీ గౌడ విజువల్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు…
    ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా భారీగానే ఉన్నాయి. అయితే కొన్ని సీన్లలో ఎడిటర్ ఇంకొంచెం తన కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది మెలో డ్రామా సీన్లని చాలా వరకు కట్ చేసి ఉంటే సినిమా ఇంకొంచెం థ్రిల్ ఫీల్ ఇచ్చేది…

    ప్లస్ పాయింట్స్

    గోపిచంద్ యాక్టింగ్
    కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్

    మైనస్ పాయింట్స్

    స్క్రీన్ ప్లే
    డైరెక్షన్

    రేటింగ్
    ఈ సినిమా కి మేము ఇచ్చే రేటింగ్ 2/5

    చివరి లైన్
    ఇక గోపిచంద్ కి హిట్ రావడం కష్టమే…