Carry Bag: ఒకప్పుడు కిరాణం షాపుల్లో సరుకులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడంతా షాపింగ్ మాల్ లో వస్తువులు కొనడం అలవాటు చేసుకుంటున్నారు. చిన్న వస్తువైనా షాపింగ్ మాల్ లో తక్కువ ధరకు వస్తుందని అక్కడికే వెళ్తున్నారు. దీంతో చిన్న వర్తకం షాపులు వెలవెలబోతున్నాయి. పండుగ సమయంలో ఈ షాపింగ్ మాల్స్ ఆఫర్లు పెట్టడమే కాకుండా డిస్కౌంట్లు ప్రకటిస్తుండడంతో వినియోగదారులు ఎక్కువగా ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. షాపింగ్ పూర్తయిన తరువాత క్యారీ బ్యాగు కోసం షాపింగ్ మాల్ వారు అదనంగా డబ్బలు వసూలు చేస్తున్నారు. కానీ దీని గురించి తెలిస్తే ఇక నుంచి డబ్బలు చెల్లించేందుకు ముందుకు రారు..
బయట సరదాగా వెళ్దమని వెళ్లి షాపింగ్ చేయాల్సి వస్తుంది. వాస్తవానికి సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్తే ఇంట్లో నుంచి క్యారీ బ్యాగు తీసుకెళ్తాం. కానీ ఇతర పనులకు వెళ్లి అటునుంచి షాపింగ్ మాల్ కు వెళ్లగానే కొన్ని ఆకర్షణీయమైన వస్తువులు కనిపిస్తాయి. దీంతో వాటిని కొనడానికి వెళ్తాం. కానీ క్యారీ బ్యాగు లేకపోవడంతో షాపింగ్ మాల్ వారు ఇస్తుంటారు.కానీ వీటికి రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు.
అయితే షాపింగ్ మాల్ వారు ఎలాంటి ముద్ర లేకుండా ప్లేన్ గా క్యారీ బ్యాగు ఇస్తే తప్పకుండా చెల్లించాలి. కానీ ఆ బ్యాగుపై ఆ సంస్థ ముద్ర ఉంటే మాత్రం ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వినియోగదారుల చట్టం 1986 According To The Section 2(1)(R) ప్రకారం సంస్థ లోగో ఉన్న బ్యాగుపై ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదు. అలా చేయడం వల్ల చట్టరీత్యా నేరమవుతుంది. ఇది వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేయడమే.
ఇలాగే బాటా కంపెనీ వారు తమ షాపు లో లోగో ఉన్న క్యారీ బ్యాగుకు అదనంగా డబ్బులు వసూలు చేశారు. దీంతో వినియోగదారుడు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లగా రూ.9000 చెల్లించాల్సి వచ్చింది. ఇప్పడు కూడా లోగో ఉన్న క్యారీ బ్యాగుకు అదనంగా చార్జీలు వసూలు చేస్తే కోర్టుకు వెళ్లడం ద్వారా పరిహారం పొందవచ్చు. అందువల్ల ఎక్కడైనా షాపింగ్ మాల్ లో క్యారీ బ్యాగ్ కోసం ఛార్జీలు వసూలు చేస్తే వెంటనే వారిన అడగండి. లేదా లోగోలేని క్యారీ బ్యాగు ఇవ్వమనండి.