Chicken Benefits: వాళ్ళు చికెన్ తింటే మంచిది

చికెన్ అనగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీని మాసం పీసులు చాలా మెత్తగా.. టేస్టీగా ఉంటాయి. అందువల్ల ఎక్కువగా చికెన్ తో కూడా ఐటమ్స్ తింటూ ఉంటారు.

Written By: Chai Muchhata, Updated On : November 14, 2023 7:27 pm

Chicken Benefits

Follow us on

Chicken Benefits: శరీరానికి కావాల్సిన శక్తి కోసం రోజూవారీ ఆహారం కాకుండా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతీ రోజూ కూరగాయలతో కర్రీ చేసుకుంటూ ఉంటారు. కొందరు మాంసాహారం లేనిదే ముద్ద దిగదు అంటారు. అయితే రోజూ మాంసాహారం తినడం శ్రేయస్కరం కాదని ఇప్పటికే చాలా మంది ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కావాలంటే అప్పుడప్పుడు కచ్చితంగా తినాలని చెబుతూ ఉంటారు. మాంసాహారాల్లోఎక్కువగా చికెన్, మటన్ తింటూ ఉంటారు. మటన్ రేటు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా చికెన్ తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ రకమైన చికెన్ తినడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చికెన్ అనగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీని మాసం పీసులు చాలా మెత్తగా.. టేస్టీగా ఉంటాయి. అందువల్ల ఎక్కువగా చికెన్ తో కూడా ఐటమ్స్ తింటూ ఉంటారు. చికెన్ తో కేవలం కర్రీ మాత్రమే కాకుండా రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. కొన్ని హోటళ్లు చికెన్ తో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను తయారు చేస్తున్నాయి. వీటి రుచి ఒక్కసారి తెలిసిన వారు మరోసారి దానిని తినేందుకు క్యూ కడుతుంటారు. అయితే సాధారణంగా కర్రీతో వండిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు. కానీ నూనెతో వేయించిన వాటిలో అధిక కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

చికెన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి అదనపు శక్తిని అందిస్తాయి. కానీ నేటి కాలంలో చికెన్ ఫ్రై, చికెన్ మంచురియా, చికెన్ టిక్కా వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తున్నారు. దీంతో వీటిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హోటళ్లలో వీటిని తయారు చేసేటప్పుడు నూనెను పదే పదే వాడుతూ ఉంటారు. అలాంటి నూనెలో వేయించిన చికెన్ ను తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. ఇది అంత త్వరగా జీర్ణం కాకుండా అడ్డుకుంటుంది.

చికెన్ లో కంటే మటన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మటన్ తరుచుగా తినడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే శరీరానికి అదనపు శక్తి కావాలంటే మాత్రం మటన్ అప్పుడప్పుడు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. చికెన్ కంటే మటన్ బరువును పెంచుతుంది. కానీ శక్తి కావాలనుకునేవారు మాత్రం మటన్ తినవచ్చు. చికెన్ , మటన్ ఏదైనా వారానికి 100 గ్రాముల చొప్పున తీసుకుంటే ఎలాంటి హాని చేయవు.