Bhole Shavali: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన భోలే షావిలీకి 5 వారాలకు అన్ని లక్షలు ఇచ్చారా?

యావర్ ఎలిమినేట్ అయితే నేను ఇంకా బాధపడే వాడిని అన్నాడు. వేదిక మీద భోలే గొప్పగా మాట్లాడాడు. చక్కని పాటలు పాడాడు. ఎలిమినేట్ అయినందుకు బాధగా ఉన్నప్పటికీ, బిగ్ బాస్ వేదిక ద్వారా తన పాట జనాలకు చేరినందుకు ఆనందంగా ఉందని భోలే అన్నాడు.

Written By: NARESH, Updated On : November 14, 2023 2:22 pm

Bhole Shavali

Follow us on

Bhole Shavali: బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతుంది. గత సీజన్ దారుణ పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో లేటెస్ట్ సీజన్ సరికొత్తగా డిజైన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ టీఆర్పీ రాబడుతున్నట్లు సమాచారం. కాగా గత వారం పాట బిడ్డ భోలే షావలి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శివాజీ, గౌతమ్, భోలే, రతిక రోజ్, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో యావర్, భోలే డేంజర్ జోన్లోకి వెళ్లారు. భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించాడు. భోలే తన ఎలిమినేషన్ ని హుందాగా అంగీకరించాడు.

యావర్ ఎలిమినేట్ అయితే నేను ఇంకా బాధపడే వాడిని అన్నాడు. వేదిక మీద భోలే గొప్పగా మాట్లాడాడు. చక్కని పాటలు పాడాడు. ఎలిమినేట్ అయినందుకు బాధగా ఉన్నప్పటికీ, బిగ్ బాస్ వేదిక ద్వారా తన పాట జనాలకు చేరినందుకు ఆనందంగా ఉందని భోలే అన్నాడు. నాగార్జునకు, బిగ్ బాస్ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పి షోని వీడారు.

భోలే మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. అనధికారిక ఓటింగ్ లో రతిక, యావర్ ఓటింగ్ లో వెనుకబడ్డారని తెలిసింది. రతిక ఎలిమినేట్ కావడం ఖాయమని అందరూ భావించారు. అనూహ్యంగా భోలే మీద వేటు పడింది. హౌస్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్ళను సేవ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రతిక, శోభలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ సేవ్ చేస్తున్నారు.

మొదట్లో తడబడిన భోలే నిలదొక్కుకున్నాడు. ఇక భోలే లేడీ కంటెస్టెంట్ అశ్వినిశ్రీతో స్నేహం చేశాడు. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. హౌస్లో సంగతులు ఒకరికొకరు చెప్పుకునేవారు. భోలే ఎలిమినేషన్ తో అశ్విని చాలా ఫీల్ అయ్యారు. భోలే 5 వారాల తర్వాత కార్డు ఎంట్రీ ఇచ్చాడు. 5 వారాలు హౌస్లో ఉన్నాడు. భోలే వారానికి రూ. 2.5 లక్షల ఒప్పందం మీద కంటెస్ట్ చేశాడట. ఆ లెక్కన రూ. 12.5 లక్షల రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం.