Nita Ambani: నీతా అంబానికి చీర కడితే.. అన్ని లక్షలా?

బెంగళూరుకు చెందిన డాలీ జై తన తల్లి చీరలు కట్టుకునే విధానం చూసి ఆకర్షితురాలయింది.. అలా భిన్న విధాలుగా చీరలు ఎలా కడతారో నేర్చుకుంది. దానినే వృత్తిగా మార్చుకుంది.

Written By: Suresh, Updated On : March 6, 2024 8:18 am

Nita Ambani

Follow us on

Nita Ambani: ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకలు ముగిసినప్పటికీ.. వాటికి సంబంధించిన ఏదో ఒక విషయం మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇప్పటిదాకా అంబానీ పెట్టిన ఖర్చు, వచ్చిన అతిధులు, వడ్డించిన వంటకాలు, చేసిన ప్రదర్శనల గురించి రకరకాల కథనాలు షికార్లు చేశాయి. అయితే వీటన్నిటికంటే ఒక వార్త భిన్నంగా కనిపిస్తోంది. అదేంటంటే..

ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానికి చీర కడితే.. ఆ చీర కట్టిన మహిళకు జరిపిన చెల్లింపుల గురించి తెలుసుకుని చాలామంది నోళ్ళు వెళ్లబెడుతున్నారు. ఎందుకంటే నీతా అంబానికి ముందస్తు పెళ్లి వేడుకల్లో చీరలు కట్టినందుకు డాలీ జైన్ అనే మహిళ అక్షరాల 2 లక్షలు వసూలు చేసింది. ఒక్క చీర కట్టినందుకే ఇంత చార్జ్ చేసిందంటే ఆమె రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆమె కేవలం నీతా అంబానికి మాత్రమే కాదు ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, సోనం కపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపిక పదుకొనే లాంటి వారికి కూడా ఈమె చీరలు కడుతుంది.

బెంగళూరుకు చెందిన డాలీ జై తన తల్లి చీరలు కట్టుకునే విధానం చూసి ఆకర్షితురాలయింది.. అలా భిన్న విధాలుగా చీరలు ఎలా కడతారో నేర్చుకుంది. దానినే వృత్తిగా మార్చుకుంది. పెళ్లయిన తర్వాత కూడా డాలి చీరలు కట్టుకునేందుకు అంతగా ఆసక్తి ప్రదర్శించలేదు. తన తల్లి చీర గొప్పతనం గురించి చెప్పిన తర్వాత కట్టుకోవడం మొదలు పెట్టింది. అలా భిన్న రకాలుగా తన మీద తానే ప్రయోగాలు చేసుకుంది. అవన్నీ విజయవంతం కావడంతో చీరలు కట్టడాన్నే ఉపాధి మార్గంగా మార్చుకుంది. 2011లో కేవలం 18.5 సెకండ్లలో చీర కట్టుకొని డాలీ జైన్ రికార్డు సృష్టించింది. డిజైనర్ సందీప్ ఖోస్లా ద్వారా సెలబ్రిటీలకు పరిచయం అయింది. అలా వారికి చీరలు కట్టడం ప్రారంభించింది. సెలబ్రిటీల శరీర ఆకృతిని బట్టి వారికి ఎలాంటి దుస్తులు సరిపోతాయో డాలి ముందే చెబుతుంది. ఆ తర్వాత వారు ఎంచుకున్న చీర లేదా ఇతర వస్త్రాలను కడుతుంది.

హైదరాబాద్, గుజరాతి, రాజస్థానీ, అస్సామీ.. ఇలా ఎన్నో రకాల చీర కట్లు ఆమెకు తెలుసు. ఆమె చీర కట్టడం మీద రకరకాల ప్రయోగాలు చేసింది. 357 విధాల్లో చీర కట్టుకోవచ్చని నిరూపించింది. తన పనిలో నేర్పరితనం వల్ల ఆమె సెలబ్రిటీ శారీ డ్రేపర్ గా మారింది. ఇక ఇటీవల ముకేశ్ అంబానీ ఇంట జరిగిన వేడుకల్లో నీతా అంబానికి చీర కట్టినందుకు అక్షరాల రెండు లక్షలను చార్జ్ రూపంలో వసూలు చేసింది. పెళ్లిళ్ల సీజన్లో డాలీ జైన్ కు ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండదంటే ఆమె ఎంత బిజీ నో అర్థం చేసుకోవచ్చు.