T20 World Cup 2024: మరికొద్ది రోజుల్లో దేశంలో ఐపిఎల్ సందడి మొదలవుతుంది. అది పూర్తికాగానే t20 ప్రపంచ కప్-24 ఆరంభమవుతుంది. ఈసారి ఈసారి టి20 వరల్డ్ కప్ నకు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఆధ్వర్యంలో అక్కడ స్టేడియం నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫుట్ బాల్, బేస్ బాల్, టెన్నిస్ వంటి క్రీడలను విపరీతంగా ఆరాధించే అమెరికన్లు.. క్రికెట్ పై అంతగా ఆసక్తి చూపించరు. పైగా ఆ దేశంలో క్రికెట్ మైదానాలు కూడా చాలా తక్కువ. ఈ క్రమంలో టీ-20 వరల్డ్ కప్ ను పురస్కరించుకొని అమెరికా కేంద్రంగా నిర్మిస్తున్న తాత్కాలిక క్రికెట్ స్టేడియం పనులు ఇంకా పూర్తి కాలేదు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో నిర్మిస్తున్న తాత్కాలిక స్టేడియం నిర్మాణ పనులకు సంబంధించి ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అమెరికాలోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు కనిపిస్తున్నాయి. 8 t20 మ్యాచ్ లకు ఈ మైదానం ఆతిథ్యం ఇస్తుంది. ఐసీసీ విడుదల చేసిన వీడియో ప్రకారం ఆ స్టేడియంలో పాలలో పూర్తి కాలేదని తెలుస్తోంది. టోర్నీ మరికొద్ది నెలల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు జగన్ పనులు కూడా పూర్తి కాలేదు. స్టాండ్ల నిర్మాణం సాగుతోంది. గత నెల రోజులుగా తూర్పు ప్రాంతంలో స్టాండ్ నిర్మాణం కొనసాగుతోంది. మిగతా ప్రాంతాల్లో స్టాండ్లు నిర్మించలేదు. అయినప్పటికీ పనుల్లో ఎంతో పురోగతి ఉందని ఐసిసి వీడియోలో పేర్కొనడం విశేషం.
సాంకేతికతకు కొత్త అర్థం చెప్పే అమెరికాలో ఏ పనులైనా త్వరగానే జరిగిపోతాయి. ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మించే అమెరికాలో ఐసీసీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న స్టేడియం పనులు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల అభిమానుల నుంచి విస్మయం వ్యక్తం అవుతున్నది. మెగా టోర్నీ ప్రారంభానికి రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో స్టేడియం ఎప్పటికి పూర్తవుతుందో ఐసీసీకే తెలియాలి..
నసావు కౌంటిలో జరిగే మ్యాచ్ ల షెడ్యూల్ ఇలా..
శ్రీలంకvs సౌత్ ఆఫ్రికా: జూన్3
భారత్vs ఐర్లాండ్: జూన్ 5
నెదర్లాండ్ vs సౌత్ ఆఫ్రికా: జూన్ 7
భారత్ vs పాకిస్తాన్: జూన్ 9
దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్: జూన్ 10
పాకిస్తాన్vs కెనడా: జూన్ 11
అమెరికాvs భారత్: జూన్ 12
The #T20WorldCup 2024 fever is gripping New York
The Nassau County International Cricket Stadium celebrates its one-month construction milestone ️
Details ➡ https://t.co/ldyYDpSA5C pic.twitter.com/SSQxrPIX0o
— ICC (@ICC) March 5, 2024