Dogs : వెనుకటి కాలంలో కుక్కలను యుద్ధాలకు వినియోగించుకునేవారు. కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ప్రత్యర్థుల మీదకి ఉసిగొల్పేవారు. కొన్ని ప్రాంతాలకు చెందిన రాజులు తమ అంగరక్షకులుగా కుక్కలను ఉంచుకునేవారు. అంగరక్షకులుగా ఉండే కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. వాటికి మాంసం, ఇతర పదార్థాలు ఆహారంగా పెట్టడం వల్ల బలంగా ఉండేవి. రాజును నిత్యం కనిపెట్టుకుంటూ ఉండేవి. అందువల్లే రాజులకు శత్రువుల నుంచి.. ప్రత్యర్ధుల నుంచి ముప్పు అంతగా ఉండేది కాదు.. కుక్కలు విశ్వాసానికి ప్రతీకలుగా ఉంటాయి. రాను రాను కుక్కలలో కొత్త జాతులు ఉద్భవిస్తున్నాయి.. ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కుక్కల వ్యాపారం 30 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ఎలా తెలుస్తోంది
కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు. రక్షణకు, కాపలాకు మాత్రమే కాదు.. కుక్కలకు అనేక విషయాలు ముందుగానే తెలుస్తాయి.. కొన్ని సందర్భాల్లో కుక్కలు నోరు అమాంతం తెరుస్తాయి. గాల్లోకి వింతగా చూసి అరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఊర్లో పెద్దవాళ్లు ఎవరో చనిపోబోతున్నారు అంటూ వ్యాఖ్యానిస్తుంటారు. ఆ సమయంలో కుక్కలకు ఏదో ప్రతీప శక్తులు కనిపిస్తున్నాయని.. అందువల్లే అవి అలా అరుస్తున్నాయని పేర్కొంటుంటారు. అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదట.. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. మనుషులు చనిపోయే విషయం కుక్కలకు ముందుగానే తెలుస్తుందని అంటున్నారు.. చావుకు దగ్గరయ్యే మనిషి శరీరంలో రకరకాల రసానిక మార్పులు చోటు చేసుకుంటాయట. ఆ మార్పుల వల్ల జరిగే వాసనను కుక్కలు పసిగడతాయట. అలాంటి వాసన ఆ కుక్కలకు తగిలినప్పుడు అవి వాటి కాళ్ల గిట్టలను నేలపై రాస్తాయి. చిన్నపాటి గోతులను తీస్తాయి. ఆకాశం వైపు వింతగా చూస్తూ ఉంటాయి. ఆ తర్వాత అదే పనిగా అరుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో.. అవి అరుపులు మానేస్తాయి. గట్టిగా అరుస్తున్న క్రమంలో కుక్కలను వారించినప్పటికీ వినిపించుకోవు. పైగా ఆ సమయంలో అవి ఒక రకమైన హావభావాలను ప్రదర్శిస్తుంటాయి. అందువల్లే కుక్కలు విశ్వాసానికి మాత్రమే కాదు.. ప్రమాద సంకేతాలను కూడా ముందుగా చూపించే జంతువులని శాస్త్రవేత్తలు అంటుంటారు.. కేవలం నాటు కుక్కలు మాత్రమే ఇలా అరుస్తుంటాయి. హైబ్రిడ్ కుక్కలు ఇలాంటి ప్రమాద సంకేతాలను గుర్తించలేవు. ఎందుకంటే అవి సంకరజాతి కుక్కలు కాబట్టి.. వాటిలో కొన్ని రకాల జన్యువులు ఉండవు. అందువల్లే ఇటువంటి మార్పులను అవి పసిగట్టలేవు. కాకపోతే ప్రకృతిలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటుంటే అవి చిత్ర విచిత్రమైన హావభావాలు ప్రదర్శిస్తాయి. అదేపనిగా తోకను ఊపుతుంటాయి..కాళ్లతో నేలను గట్టిగా రాకుతుంటాయి. నోటి నుంచి చొంగ ను కారుస్తూ ఉంటాయి.. కాకపోతే వింత వింత చూపులతో ఆందోళనతో కనిపిస్తాయి. ఇక తమ యజమానులకు దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాయి.. ఆహారాన్ని కూడా సరిగ్గా తినవు.
Also Read : ముకేశ్ అంబానీకి దగ్గర బంధువు అనుకుంటా.. 50 కోట్లతో కుక్కను కొన్నాడు..