spot_img
Homeజాతీయ వార్తలుDog Bite Dangers: కుక్క కాటు ఎంత ప్రమాదకరమంటే.. ఇతడి పరిస్థితి చివరికి ఇలా అయ్యింది.....

Dog Bite Dangers: కుక్క కాటు ఎంత ప్రమాదకరమంటే.. ఇతడి పరిస్థితి చివరికి ఇలా అయ్యింది.. వైరల్ వీడియో

Dog Bite Dangers: కుక్క కాటు అనేది అత్యంత ప్రమాదకరమైనది. దురదృష్టవశాత్తు కుక్క కాటు వేస్తే.. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. అప్పుడే రేబిస్ వ్యాధి నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. అలాకాకుండా రేబిస్ వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కుక్క కాటు వేసిన తర్వాత నిర్లక్ష్యం చేసిన ఓ యువకుడి పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.

Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ ప్రాంతంలో 17 సంవత్సరాల కరణ్ అనే యువకుడు సరిగ్గా నాలుగు నెలల క్రితం కుక్క కాటుకు గురయ్యాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వారు అతనికి వ్యాక్సిన్ వేయించలేకపోయారు. ఆ కుక్క లో రేబిస్ లక్షణాలు ఉండటంతో.. కరణ్ కూడా రేబిస్ బారిన పడ్డాడు. రేపు తీవ్రత ఎక్కువ అతడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో అతడు కుక్క మాదిరిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు బతకడం కష్టమని తేల్చారు. చివరి ప్రయత్నంగా అతడిని అత్యవసర వైద్య విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

కుక్కలు ఎలాంటివైనా సరే.. అవి కరిచినప్పుడు కచ్చితంగా రేబీస్ నిరోధక వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎందుకంటే రేబిస్ సోకితే మనిషి కుక్క మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.. ఈ సమయంలో ఒకవేళ రోగికి కనుక నీరు తగిలితే తీవ్రంగా ఇబ్బంది పడతాడు. కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవిస్తూ ఉంటుంది. రేబిస్ వ్యాధి సోకినప్పుడు ప్రారంభ దశలో మనిషి కుక్క మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కుక్కలాగా అరుస్తూ ఉంటాడు. అనంతరం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ.. కుక్కలాగా కరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ సమయంలో రోగి నీటిని చూస్తే భయపడుతూ ఉంటాడు. దీనినే హైడ్రోఫోబియా అంటారు.

సాధ్యమైనంత వరకు కుక్క కరిస్తే వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలి. గాయాన్ని డెటాల్ తో శుభ్రం చేసుకోవాలి. వైద్యుడి సలహాల మేరకు మందులు వాడాలి. ఒకప్పుడు కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఐదు వ్యాక్సిన్లు వేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకప్పటి మాదిరిగా బొడ్డుచుట్టు కాకుండా.. ఒకటే వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా రేబిస్ నిరోధక వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచుతున్నాయి. కుక్క కాటుకు గురైన వారు వెంటనే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రేబిస్ వ్యాధి నుంచి రక్షణ లభిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular