Nani Dasara Movie: హీరో నానికి టఫ్ టైం నడుస్తుంది. ఆయన కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అనూహ్యంగా ఓ కొత్త డైరెక్టర్ కి నాని అవకాశం ఇచ్చాడు. నిజంగా ఇది సాహసమే. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నాని దసరా మూవీ స్క్రిప్ట్ నచ్చి ఆఫర్ ఇచ్చాడు. శ్రీకాంత్ ఓదెల ఒక పెద్ద బాధ్యత తలకెత్తుకొని దసరా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దసరా చిత్రాన్ని ఓ పాన్ ఇండియా మూవీగా ప్రకటించడం మరో విశేషం. కాబట్టి నానికి దసరా చాలా స్పెషల్. సక్సెస్ కావడం అవసరం.

అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ స్టార్ట్ చేసిన నాని అష్టా చెమ్మా చిత్రంతో హీరో అయ్యాడు. అక్కడి నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ టైర్ టూ హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకున్నారు. విజయ్ దేవరకొండ వచ్చే వరకు ఆ పొజిషన్ ఆయనదే. ఒక దశలో స్టార్ హీరోలతో పోటీపడే స్థాయికి వెళ్లారు. నాని మినిమమ్ గ్యారంటీ హీరో. ఆయన సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉండదనే అభిప్రాయం. ప్రేక్షకుల్లో ఉంది. వరుస హిట్స్ ఇచ్చి నాని రేసులో దూసుకొచ్చాడు.
కొన్నాళ్లుగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్నాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకొని కూడా కలెక్టన్స్ రాబట్టలేకపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన శ్యామ్ సింగరాయ్ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. లాస్ట్ రిలీజ్ అంటే సుందరానికీ డిజాస్టర్ అయ్యింది. నిజానికి ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. గ్యాంగ్ లీడర్, జెర్సీ మంచి చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి కానీ కమర్షియల్ గా ఆడలేకపోయాయి.

సో… నానికి భారీ కమర్షియల్ హిట్ కావాలి. అది శ్రీకాంత్ ఓదెల ఇవ్వాలి. అందుకే అందరి చూపు ఈ కొత్త కాంబినేషన్ మీద పడింది. శ్రీకాంత్ ఆ దిశగా ఓ అడుగైతే వేశాడు. దసరా మూవీ మీద జనాల్లో ఓ ఆసక్తి ఉంది. నాని డీగ్లామర్ లుక్, సిల్క్ స్మిత తో కూడా పోస్టర్స్, వెన్నెలగా కీర్తి సురేష్ డీగ్లామర్ లుక్… దసరా మూవీ చూడాలనే కోరిక కలిగేలా చేశాయి. సినిమా సక్సెస్ కి అది చాలదు. హైప్ ఓపెనింగ్స్ తేగలదు కానీ హిట్ కొట్టాలంటే లాంగ్ రన్ లో మంచి వసూళ్లు సాధించాలి. అది జరగాలంటే మూవీ బాగుండాలి.
మరి నాని పెద్ద బాధ్యత శ్రీకాంత్ కి అప్పగించారు. దసరా చిత్రాన్ని ఓ అద్భుత చిత్రంగా మలిచి ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకాంత్ ఓదెల దసరా మూవీతో విజయం నమోదు చేయగలితే ఆయన దశ తిరిగినట్లే. నాని ఫేవరెట్ దర్శకుల జాబితాలో చేరుతారు. టాలీవుడ్ మేకర్స్ దృష్టి పడతారు. మరి చూడాలి ఈ కొత్త కాంబినేషన్ ఏ మేరకు మెప్పిస్తుందో. సుధాకర్ చెరుకూరి దసరా చిత్ర నిర్మాతగా ఉన్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.