Tamannaah Bhatia: హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. అది ఉన్నంత కాలమే వారి ప్రయాణం సాగుతుంది. ముఖంలో మెరుపు పోయినా… శరీరం సరైన షేప్ లో లేకపోయినా హీరోలు దేకరు. దర్శక నిర్మాతలు పట్టించుకోరు. అందుకే హీరోయిన్స్ చిన్న చిన్న లోపాలు మేకప్ తో కవర్ చేస్తారు. సాధారణ ఆడియన్స్ లో కూడా హీరోయిన్ అంటే భూలోక సుందరి అనే భావన కలిగించాలి. లేదంటే జనాల్లో ఇమేజ్ పోతుంది. ఈ కారణాలతో హీరోయిన్స్ మేకప్ లేకుండా బయటకు రారు. పబ్లిక్ లోకి వస్తే కెమెరాలు వాళ్ళను చుట్టుముడతాయి కాబట్టి… చాలా ట్రెండీగా సిద్దమై కనిపిస్తారు.

దీనికి భిన్నంగా తమన్నా తన మేకప్ లెస్ లుక్ షేర్ చేసింది. నేచురల్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం తమన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె రియల్ బ్యూటీపై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటిలాగే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మేకప్ లేకుండా కనిపించి తమన్నా పెద్ద సాహసమే చేశారని చెప్పొచ్చు. తమన్నా ధైర్యానికి కారణం ఉంది. ఆమె స్టార్ హీరోయిన్ గా హైట్స్ చూశారు. కొత్తగా ఆమె తెచ్చుకోవాల్సిన ఇమేజ్ ఏం లేదు.
ఇక మేకప్ లేకపోయినా తమన్నా గ్లామర్ లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఆమె అందంగానే ఉన్నారు. ఆ మధ్య తమన్నా బాడీ షేమింగ్ కి గురయ్యారు. కోవిడ్ బారిన పడిన ఈ స్టార్ లేడీ… ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో బరువు పెరిగారు. కొంచెం షేప్ అవుట్ అయిన తమన్నా ఫోటోలను నెటిజెన్స్ ట్రోల్ చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. అనారోగ్యంతో బరువు పెరిగినా విమర్శలు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. కష్టపడి తమన్నా మునుపటి షేప్ సాధించారు.

కాగా తమన్నా రిలేషన్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే పుకారు ఊపందుకుంది. న్యూ ఇయర్ వేడుకలు వీరిద్దరూ కలిసి జరుపుకున్నారు. అలాగే పలు సందర్భాల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. పరిణామాలు గమనిస్తుంటే తమన్నా-విజయ్ వర్మ మధ్య ఎఫైర్ ఖాయమే అంటున్నారు. సాధారణంగా మీడియాలో తనపై వచ్చే కథనాలకు తమన్నా వెంటనే స్పందిస్తారు. వారం రోజులుగా విజయ్ వర్మతో ఎఫైర్ వార్త చక్కర్లు కొడుతున్నా తమన్నా నోరు విప్పకపోవడం అనుమానాలు బలపరుస్తుంది.
View this post on Instagram