https://oktelugu.com/

Bhuma Mounika Reddy: మంచు మనోజ్ కి కాబోయే భార్య మౌనిక మొదటి భర్త ఎవరో తెలుసా? కొడుకు కూడా ఉన్నాడు!

Bhuma Mounika Reddy: మంచు మనోజ్ వివాహం నేడు ఘనంగా జరుగుతుంది. హైదరాబాద్ లోని అక్క మంచు లక్ష్మి నివాసం ఈ వేడుకకు వేదిక కానుంది. గత మూడు రోజులుగా మనోజ్ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 3 శుక్రవారం రాత్రి 8:30 నిమిషాలకు ముహూర్తం. భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేయనున్నారు.అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం. మంచు మనోజ్ కి ఇది రెండో వివాహమన్న విషయం తెలిసిందే. 2019లో […]

Written By:
  • Shiva
  • , Updated On : March 3, 2023 / 05:38 PM IST
    Follow us on

    Bhuma Mounika Reddy

    Bhuma Mounika Reddy: మంచు మనోజ్ వివాహం నేడు ఘనంగా జరుగుతుంది. హైదరాబాద్ లోని అక్క మంచు లక్ష్మి నివాసం ఈ వేడుకకు వేదిక కానుంది. గత మూడు రోజులుగా మనోజ్ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 3 శుక్రవారం రాత్రి 8:30 నిమిషాలకు ముహూర్తం. భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేయనున్నారు.అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం. మంచు మనోజ్ కి ఇది రెండో వివాహమన్న విషయం తెలిసిందే. 2019లో ఆయనకు ప్రణతిరెడ్డితో విడాకులయ్యాయి.

    ఇక మనోజ్ వివాహమాడుతున్న అమ్మాయి భూమా మౌనిక రెడ్డి వివరాలు పరిశీలిస్తే… ఆమెకు కూడా ఇది రెండో వివాహం. 2016లో భూమా మౌనిక బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఒక అబ్బాయి పుట్టాడు. కొడుకు పేరు ధైరవ్ రెడ్డి. అనంతరం ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోయారు. భూమా మౌనికది పొలిటికల్ ఫ్యామిలీ. నంద్యాల కేంద్రంగా రాజకీయాల్లో చక్రం తిప్పిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె.

    తల్లిదండ్రులిద్దరూ మరణించారు. అక్క అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ గవర్నమెంట్ లో మంత్రిగా కూడా చేశారు. భూమా నాగిరెడ్డి కుటుంబంతో మోహన్ బాబుకు ఎప్పటి నుండో సంబంధాలు ఉన్నాయి. మంచి పరిచయం, సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. గతంలో మౌనిక, మంచు మనోజ్ ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారని టాక్. కారణం ఏదైనా అది జరగలేదు. వేరే వ్యక్తులతో ఇద్దరికీ వివాహాలు జరిగి విడాకులు అయ్యాయి.

    గత ఏడాది గణేష్ చతుర్థి సందర్భంగా మనోజ్, మౌనిక కలిసి పూజలు జరిపారు. అప్పుడే వీరి పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మనోజ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎట్టకేలకు మార్చి 3న మనోజ్ వివాహం అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మౌనికని మోహన్ బాబు కోడలిగా అంగీకరించడం లేదట. ఈ విషయంలో మనోజ్ తో ఆయన గొడవపడ్డారని టాక్. విష్ణు, మోహన్ బాబు ఈ వివాహానికి హాజరు కాకపోవచ్చంటున్నారు. ఈ విభేదాల నేపథ్యంలో మనోజ్ ఇంటికి దూరంగా ఉంటున్నారన్న వాదన కూడా ఉంది. అయితే మంచు లక్ష్మి ఈ పుకార్లను ఖండించారు. మనోజ్ ఫ్యామిలీకి దూరమయ్యాడన్న వార్తలపై నేడు స్పష్టత రానుంది. మోహన్ బాబు వివాహానికి హాజరు కాని పక్షంలో కథనాల్లో వాస్తవం ఉన్నట్లే. మనోజ్ ఇటీవల ‘వాట్ ది ఫిష్’ అనే కొత్త మూవీ ప్రకటించారు.

    Tags