Kakinada GGH: ఏదైనా ఆపరేషన్ చేసే ముందు డాక్టర్లు పేషేంట్‌కు మత్తు మందు ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆపరేషన్ సమయంలో వాళ్లకుప్రనొప్పి తెలియదు. దీంతో వాళ్లు ఎలాంటి ఇబ్బంది పెట్టరు. అయితే తాజాగా కాకినాడ ఆసుపత్రి వైద్యులు పేషేంట్‌కు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా అదుర్స్ కామెడీ సీన్లు చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా సర్జరీ చేసిన డాక్టర్లను అందరూ ప్రశంసిస్తున్నారు. కాకినాడలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కాకినాడలోని కొత్తపల్లికి చెందిన అనంత లక్ష్మీ అనే మహిళ కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతుంది. కాలు, చేతులు బాగా లాగుతున్నాయని వాళ్లకు దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. మందులు అన్ని వాడినా కూడా ఎలాంటి ఫలితం లేదు. అన్ని స్కానింగ్‌లు చేసి డాక్టర్లు ఆమెు తలలో కణితి ఉందని తెలిపారు. దీనిని తొలగించడానికి ఆపరేషన్ చేస్తే ఎక్కువగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు డబ్బుుల లేక ఆమె మందులు వాడుతూనే ఉంది. అయితే ఒక వారం కిందట ఆమెకు తలనొప్పి వచ్చి కింద పడిపోయారు. అలాగే ఆమె శరీరం కూడా పనిచేయలేదు. కుడి చేయి, కుడి కాలులో అసలు చలనం లేదు. దీంతో కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు మళ్లీ ఆమెకు టెస్టులు చేసి తలలో కణితి పెద్ద కణితి ఉందని తెలిపారు. మెదడులో ఎడమవైపు పెద్ద పరిమాణంలో కణితి ఉంది. ఇది ఇలాగే ఉంటే ప్రమాదమని వెంటన ఆపరేషన్ చేయాలని అనంతలక్ష్మీ కుటుంబ సభ్యులతో చెప్పారు.
తలలో ఈ కణితిని తొలగించడాలంటే ఆపరేషన్ చేయాలి. ఈ సర్జరీని అవేక్ క్రేనియాటమీ అంటారు. దీనికి సర్జరీ చేయాలంటే రోగి తప్పకుండా మెలకువలో ఉండాలి. అప్పుడే ఆపరేషన్ చేయాలి. లేకపోతే చేయకూడదు. అయితే ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ చేశారు. డాక్టర్లు సర్జరీ చేసేటప్పుడు ఆమెకు అదుర్స్ సినిమాలోని కామెడీ సీన్లను చూపించారు. ఒక ట్యాబ్ ఇచ్చి అదుర్స్‌లోని సినిమాలోని బ్రహ్మనందం, ఎన్టీఆర్ మధ్య జరిగే కామెడీ సీన్లను వేశారు. వాటిని చూస్తుండగానే వైద్యులు ఆమె తలలోని కణితిని తొలగించారు. మొదటి ఇలా కాకినాడ ఆసుపత్రిలో చేయడం జరిగిందని వైద్యలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా బాగానే ఉంది. ఒక ఐదు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా కామెడీ సీన్లు చూపిస్తూ సర్జరీ చేయడంతో అందరూ కూడా వైద్యులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.