https://oktelugu.com/

Venkateswara Swamy: తిరుమల వేంకటేశ్వరుడు ఎందుకు కళ్లు మూసుకుంటాడో తెలుసా?

విగ్రహాలు కనులు తెరిచినట్టు కనిపించేలా వెండి కనుబొమ్మలు ఉంచడం ఆనవాయితీ. ఇలా ఉంటే ఆ భగవంతుడు ప్రపంచాన్ని చూస్తున్నాడని నమ్ముతుంటారు. అదే విధంగా పెద్ద పెద్ద కళ్లతో వెంకటేశ్వర స్వామీ కూడా ఈ లోకాన్ని చూస్తున్నాడని భక్తులు నమ్ముతుంటారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 30, 2023 1:50 pm
    Venkateswara Swamy

    Venkateswara Swamy

    Follow us on

    Venkateswara Swamy: తిరుపతికి వెళ్లాలంటే మామూలు విషయం కాదు. ఆ తిరుమల తిరుపతి పిలుచుకుంటే గానీ ఆయన దర్శనం అవదని నమ్మతారు భక్తులు. ఇక ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలయం. కేవలం భారతీయులు మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా తిరుమలను సందర్శించడానికి వస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు కూడా. మరి ఎన్నో ఆసక్తికరమైన కథలు ఈ ఆలయం చుట్టూ ఉన్న విషయం తెలిసిందే. అయితే వెంకటేశ్వరుడు కళ్లు మూసుకోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

    విగ్రహాలు కనులు తెరిచినట్టు కనిపించేలా వెండి కనుబొమ్మలు ఉంచడం ఆనవాయితీ. ఇలా ఉంటే ఆ భగవంతుడు ప్రపంచాన్ని చూస్తున్నాడని నమ్ముతుంటారు. అదే విధంగా పెద్ద పెద్ద కళ్లతో వెంకటేశ్వర స్వామీ కూడా ఈ లోకాన్ని చూస్తున్నాడని భక్తులు నమ్ముతుంటారు. అయితే ప్రతి గురువారం శ్రీవారి నామాలు కాస్త చిన్నవిగా పెడతారట. దీని వల్ల భక్తులు స్వామి వారి కళ్లను చూస్తారు. ఇక ఈ రోజున స్వామికి అర్చన చేసిన తర్వాత జరిగే నివేదన తిరుప్పావై సేవ. దీన్నే అన్న కుడోత్సవం అని కూడా పిలుస్తారు.

    గురువారం ఉదయం 6 గం.కు శ్రీవారి మూలమూర్తికి ధరించిన అన్ని ఆభరణాలను తొలగిస్తారట. అప్పుడు స్వామికి పెట్టే తిరునామం తగ్గించి కళ్లు స్పష్టంగా కనిపించేలా చేస్తారు. అప్పుడు స్వామిని ఎన్నో పూలతో అలంకరిస్తారు. ఈ సేవలో భక్తులు కూడా పాల్గొంటారు. అప్పుడు వేద పండితులు వేద పఠనం చేస్తూ ఉంటారు. అయితే భక్తులకు ఈ సేవతో పాటు నేత్ర దర్శనం కూడా కలుగుతుంది. ఇక గురువారం రోజు అభిషేకానికి ముందు ఆయన నగలు తీయగానే వేడి వేడిగా ఉంటాయట ఆభరణాలు. అంతే కాదు అభిషేకం సమయంలో స్వామి వారు తన మూడవ కన్ను తెరుస్తారని భక్తుల నమ్మకం.