Homeట్రెండింగ్ న్యూస్Pin Code: మన పిన్‌కోడ్‌లో ఆరు నంబర్లే ఎందుకుంటాయో తెలుసా?

Pin Code: మన పిన్‌కోడ్‌లో ఆరు నంబర్లే ఎందుకుంటాయో తెలుసా?

Pin Code: పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌ ఇలా.. మీ నంబర్‌ చెప్పమంటే ఎవరికీ తెలియదు. పిన్‌ కోడ్‌ అనగానే టక్కున ఆరు అంకెల నంబర్‌ చెబుతాం. భారత దేశం మొత్తం ప్రతీ గ్రామానికి ఒక పిన్‌కోడ్‌ నంబర్‌ ఉంటుంది. అయితే దేశంలో లక్షల గ్రామాలు ఉన్నా నంబర్‌ మాత్రం ఆరు అంకెట్లోనే ఉంటుంది. ఇలా ఎలా సాధ్యం.. ఆరు అంకెలే ఎందుకు ఉంటుంది అనేది తెలుసుకుందాం.

1972లో కేటాయింపు..
పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌ను భారత ప్రభుత్వం 1972, ఆగస్టు 15న ప్రవేశపెట్టింది. ఈ పిన్‌కోడ్‌ ఆధారంగా దేశంలోని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలను ఎలాంటి కన్ఫ్యూజ్‌ లేకుండా గుర్తించవచ్చు. పర్టిక్యులర్‌ పోస్ట్‌ ఆఫీస్‌ను కూడా ఐడెంటీఫై చేస్తారు.

ఎనిమిది జోన్లు..
ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం మన దేవంలోని పోస్టల్‌ శాఖను 8 జోన్లుగా విభజించింది. కొన్ని రాష్ట్రాలు కొలిపి ఒక జోన్‌గా ఏర్పాటు చేసింది. ఈ ఎనిమిది జోన్లను జీయోగ్రాపికల్‌ పీనీనియన్స్‌ అంటారు. ఇందులో మరో జోన్‌ కూడా ఉంటుంది. అది ఆర్మీ పోస్టల్‌ జోన్‌. దీని నంబర్‌ 9. ఇది కేవలం ఆర్మీకి సంబంధించింది మాత్రమే. మొత్తంగా ఇండియాలో 9 పీన్నీనియన్స్‌ ఉన్నాయి.

జోన్లు ఇలా..
1, 2 నంబర్‌ జోన్లు నార్త్‌ జోన్లు, ఇందులో డిల్లీ, హరియాణ, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, పాండిచ్చేరి, జమ్ము కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్‌ ఉన్నాయి.

3, 4 ఈ జోన్లను వెస్ట్రన్‌ జోన్లుగా పిలుస్తారు. ఇందులో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛండీఘర్‌ ఉన్నాయి.

5, 6, ఈ నంబర్‌ జోన్లను సౌత్‌ జోన్లు అంటారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరల, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.

7, 8 ఈ నంబర్‌ జోన్లను ఈస్టర్న్‌ జోన్లుగా పిలుస్తారు. ఇందులో పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

9వ జోన్‌ పూర్తిగా ఆర్మీ జోన్‌. ఇది ఆర్మీ సేవలకు మాత్రమే ఉపయోగిస్తారు.

ఆరు నంబర్లు ఇలా..
ఇక పిన్‌కోడ్‌లో ఉండే ఆరు నంబర్లలో ఒక్కోటి ఒక్కో అంశాన్ని తెలియజేస్తాయి. మొదటి నంబర్‌ రీజియన్‌ను తెలియజేస్తుంది. రెండో నంబర్‌ సబ్‌ రీజియన్‌ను తెలుపుతుంది. మూడోది జిల్లాను తెలియజేస్తుంది. తర్వాత ఉన్న మూడు నంబర్లు పోస్టాఫీస్‌ను తెలియజేస్తాయి. 500085 పిన్‌ నంబర్‌ను తీసుకుంటే.. ఇందులోని మొదట ఉన్న 5 నంబర్‌ సౌత్‌ రీజియన్‌ను తెలుపుతుంది. మొదటి రెండు నంబర్లు తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తాయి. మొదటి మూడు నంబర్లు కలిపి తెలంగాణలోని హైదరాబాద్‌ జిల్లాను సూచిస్తాయి. తర్వాత ఉన్న మూడు నంబర్లు కేపీహెచ్‌బీ కాలనీలోని పోస్ట్‌ ఆఫీస్‌ను సూచిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version