Trains Speed: రైలు ప్రయాణం సౌకర్యవంతమైనది. బస్సు, కార్లు, బైకు.. వీటితో పోల్చుకుంటే భిన్నమైనది. మిగిలిన ప్రయాణ మార్గాలకు లేని ప్రత్యేకతలు రైలు ప్రయాణ మార్గానికి ఉంది. దీంతో సుదూర ప్రయాణాలకు రైలు ప్రయాణాన్నే చాలా మంది ఎంచుకుంటారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, ధనికులు ఇలా అన్ని వర్గాల వారు కలిసి ప్రయాణించే ప్రయాణమార్గం ఏదైనా ఉంది అంటే అది రైలు మార్గమే.

భారతీయ రైల్వేకు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద రైల్వే కనెక్టివిటీ ఉన్న దేశం ఇండియానే. రైలు ప్రయాణానికి ప్రత్యేకత ఉన్నప్పటికీ.. మరెన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. సాధారణంగా రైళ్లు స్పీడ్ గా వెళ్తాయి. పగటి పూటతో పోల్చుకుంటే రాత్రిపూట రైళ్లు వేగంగా వెళ్తాయి. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
పగటి పూట రైల్వే ట్రాక్ ల పై జంతువుల సంచారం ఉంటుంది. అదే సమయంలో రోడ్డు ప్రయాణాలు రైల్వే గేట్ల మీదుగా జరుగుతాయి. దీంతో రైల్వే గేట్ ఉన్న ప్రాంతంలో రైలు వేగం తగ్గించాల్సి ఉంటుంది. ఇలా పలుచోట్ల రైల్వే గేట్లు ఉంటాయి. మనుషుల రాకపోకలు కూడ రైల్వే ట్రాక్ పై జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి పగటి పూట రైళ్లను నిదానంగా నడుపుతారు.

రాత్రిపూట ఎలాంటి జనసంచారం ఉండదు. రైల్వే ట్రాక్ల పై మరమ్మత్తులు కూడ ఉండవు. లోకో పైలెట్లకు దూరం నుంచి కూడ సిగ్నల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో ఎక్కడ ఆపాలో.. ఎక్కడ వేగం తగ్గించాలో లోకో పైలెట్లకు బాగా అర్థమవుతుంది. దీంతో రాత్రిపూట్ స్పీడ్ గా వెళ్తారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు కూడ రాత్రిపూట జర్నీనే ఇష్టపడతారు.