America flights: ప్రపంచానికి పెద్దన్న లాగా వ్యవహరించే అమెరికా లో గందరగోళం నెలకొంది. ఆ దేశంలో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక సమస్య వల్ల దేశమంతటా విమానాల రాకపోకలు నిలిచిపోయినట్టు ఆ దేశ మీడియా తెలిపింది.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సిస్టంలో భారీ సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతట అన్ని విమానాలు నిలిపివేశారు.. దీంతో పలు జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులతో విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు.

సాంకేతిక లోపం కారణంగా యునైటెడ్ స్టేట్స్ అంతటా విమానాలు ప్రభావితమయ్యాయని తెలుస్తోంది.. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ “ఫ్లైట్ అవేర్ యూఎస్” ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5 : 31 గంటలకు యునైటెడ్ స్టేట్స్ లో 400 విమానాలు ఆలస్యమయ్యాయని ఆ సైట్ నివేదించింది.. ఎక్కడి విమానాలు అక్కడే ఉండడంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సాంకేతిక లోపం కారణంగా యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేసింది. ఎఫ్ఏఏ తన వెబ్ సైట్ లో నోటీస్ టు ఎయిర్ మిషన్ వ్యవస్థ బుధవారం తెల్లవారుజామున విఫలమైందని తెలిపింది..

వాస్తవానికి యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ప్రమాదాల గురించి పైలెట్లు, ఇతర విమాన సిబ్బందిని హెచ్చరిస్తుంది.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్లో సమస్యను ఎదుర్కొంటున్నందున యునైటెడ్ స్టేట్స్ అంతటా విమానాలు నిలిపివేశారని వెబ్సైట్ పేర్కొంది. ఇప్పుడు తన నోటీస్ టు ఎయిర్ మిషన్స్ సిస్టం పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్టు ఎఫ్ఏఏ ఒక ప్రకటనలో తెలిపింది.. దీనివల్ల జాతీయ గగనతల వ్యవస్థ అంతటా విమానాల కార్యకర్తలు ప్రభావితమయ్యాయి అని పేర్కొన్నది.. ఎప్పుడు విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామో చెప్పలేమని ఆ సంస్థ తెలిపింది.