
Vastu Tips: మన ఇంటి ఆవరణలో పచ్చని చెట్టు పెంచుకుంటాం. పచ్చదనంతో ఇంటి ఆవరణ ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కానీ మనం పెంచే చెట్లు మనకు మంచి చేసేవి ఉండాలి. చెడు ఫలితాలు ఇచ్చే వాటిని దూరంగా ఉంచాలి. అప్పుడే మన ఇంటికి మంచి యోగం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. వాస్తు ప్రకారం మన ఇంటికి ఐశ్వర్యం ఇచ్చే మొక్కలను ఎంచుకోవడం ఉత్తమం.
ముళ్ల మొక్కలు
ఇంటి ఆవరణలో ఎప్పుడు కూడా ముళ్లతో కూడిన మొక్కలు నాటడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. దీంతో కుటుంబమే చిన్నాభిన్నం అవుతుంది. మనస్పర్దలు ఏర్పడతాయి. బంధువుల మధ్య వైరం పెరుగుతుంది. దీని వల్ల కలహాలు వస్తాయి. అందుకే ఇలాంటి మొక్కలు ఇంటి ఆవరణలో ఉండకపోవడమే శ్రేయస్కరం. ఇందులో నిమ్మ, రేగు వంటి మొక్కలు ఉంచుకోవడం వల్ల మనకు ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి.
చింత చెట్టు
ఇంటి ఆవరణలో ఉండకూడని చెట్లలో చింతచెట్టు ఒకటి. చింతచెట్టు చింతలు తెచ్చేదిగా ఉంటుంది. ఇది ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. చింతలే ఎదురవుతాయి. అందుకే ఇంటి ఆవరణలో చింత చెట్టు ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఉంటే వెంటనే తీసేయాలి. అంతేకాని చింత చెట్టు ఉంచుకోకండి. వాస్తు ప్రకారం నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.

ఖర్జూర చెట్టు
ఇంటి ఆవరణలో ఖర్జూర చెట్టు కూడా ఉండకూడదు. దీనికి కూడా ముళ్లు ఉంటాయి. అందుకే ఈ చెట్టు ఉంచుకోవడం వల్ల నష్టాలే. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది. ఇంటి పరిసరాల్లో ఖర్జూరం ఉంటే కలహాలే. దీంతో మన ఇంటి ఆవరణలో మనకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మొక్కలను పెంచుకుంటే సరి. నెగెటివ్ ఎనర్జీ ఇచ్చే వాటిని పెంచుకోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది.