
Shivratri 2023: మహాశివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తారు. రాత్రంతా జాగరణ చేస్తారు.శంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. పొద్దంతా ఉపవాసం ఉండి దీపం ముట్టిస్తారు. రాత్రంతా నిద్ర పోకుండా ఓం నమ: శ్శివాయ మంత్రాన్ని జపిస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పూజలు చేసి తమ కోరికలు తీర్చాలని వేడుకుంటారు. ఫిబ్రవరి 18న జరిగే జాతర మహోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్ని ముస్తాబవుతున్నాయి. శంకరుడిని కొలిచి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి ఒక్కరు జాగరణ చేసి తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటారు.
శంకరుడిని..
శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల పద్ధతుల్లో పూజలు చేస్తుంటారు. ఆ పూజ కూడా సరైన విధంగా చేయాలి. అంతేకాని ఇష్టారాజ్యంగా చేయడం అంత సురక్షితం కాదు. మహా శివరాత్రి సందర్భంగా పూజించే సమయంలో శివుడికి అర్చన చేసేందుకు పొరపాటున కూడా తులసీ దళాలు ఉపయోగించకూడదు. తప్పుడు పద్ధతుల్లో పూజ చేస్తే ఫలితం ఉండదు. మంచి పద్ధతుల్లో పూజ చేస్తేనే శివుడు ప్రసన్నుడు అవుతాడు. దీంతో మనకు ఎన్నో ఫలితాలు ఇస్తాడు. అంతేకాని తప్పుడు మార్గాల్లో చేస్తే నష్టాలే వస్తాయి.
బిల్వ పత్రాలతోనే..
శివుడిని బిల్వ పత్రాలతో పూజించాలి. మామూలు రోజుల్లోనే బిల్వ పత్రాలు వాడతారు. ఇక శివరాత్రి రోజు ఆయనకు బిల్వ పత్రాలతో పూజిస్తే మనకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. శంకరుడికి అభిషేకం చేస్తుంటారు. కానీ శివుడికి అభిషేకం చేసేందుకు పాల ప్యాకెట్లు వాడకూడదని చెబుతున్నారు. పాలను చెంబుతో తీసుకెళ్లి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఆవుపాలతో అభిషేకం చేస్తే మంచి ఫలితం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శివుడికి స్వచ్ఛమైన నీటితోనే అభిషేకం చేయాలి.
వెంట్రుకలు ఉంచుకుంటే..
శివుడికి అభిషేకం చేసే సమయంలో ఒంటిపై చెమట ఉండకూడదు. వెంట్రుకలు కూడా ఉంచుకోకూడదు. వెంట్రుకలు శివుడి మీద పడితే నష్టాలే. శివరాత్రి రోజు మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలనే నిబంధన ఏదీ లేదు. కడుపు ఖాళీగా ఉంటే భక్తి మీద కంటే కడుపు మీదే మనసు పడుతుంది. అందుకే పూర్తిగా ఉపవాసం ఉండకుండా అల్పాహారం తీసుకోవడం మంచిదే. శివరాత్రి రోజు పొగ తాగరాదు. అల్కహాల్ కు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. భార్యాభర్తల కలయిక కూడా వద్దని సూచిస్తున్నారు.

దానధర్మాలు చేయడంతో..
శివరాత్రి రోజు దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శివుడిని పూజించడంతో పాటు పేదవారికి ధర్మం చేయడం కూడా మంచిదే. ఈ విషయాలను పట్టించుకుని శివుడిని సంతోష పెట్టేందుకు మనం కూడా కొన్ని పద్ధతులు పాటిస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. దీనికి కావాల్సిందల్లా నిష్టగా ఉండటమే. దేవుడి స్మరణలో గడపడమే.